కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు ఇంట్లో కాపు నేతల సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి కాంగ్రెస్‌తో పాటు బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కూడా హాజరైనట్లు తెలిసింది. ప్రతిపక్ష పార్టీలను పిలవడమేంటని మీనాక్షి నటరాజన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ అంశంపై తాజాగా వీహెచ్ స్పందించారు. “ఒకరిద్దరికి కోపం రావచ్చు. నిన్న మీటింగ్ లో సీఎం నీ.. ప్రభుత్వాన్ని ఎవరు తిట్టలేదు. జనాభా లెక్క కొంచెం తక్కువ ఉందని అన్నారు. దాని మీద సీఎం తోనే మాట్లాడుతాం. సీఎం తో మాట్లాడిన తర్వాత మున్నూరు కాపు సభ తేదీ ఖరారు చేస్తాం.” అని వీహెచ్ హనుమంతరావు స్పష్టం చేశారు.
READ MORE: Harish Rao : సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీష్‌రావు బహిరంగ లేఖ..
కాగా.. ఈ సమావేశం విషయంపై AICC (అఖిల భారత కాంగ్రెస్ కమిటీ) సీరియస్ అయింది. కాంగ్రెస్ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ ఈ భేటీపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలను పిలిచి, ప్రభుత్వాన్ని విమర్శించడం ఏమిటని ప్రశ్నించారు. బీసీ కుల గణన చేసిన ప్రభుత్వాన్ని అభినందించాల్సిన పరిస్థితిలో, విమర్శించడం కరెక్ట్ కాదని ఆమె అన్నారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ పార్టీ లీడ్ చేయాల్సిన సమావేశానికి ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలను పిలిపించడం ఏంటని మీనాక్షి నటరాజన్ ప్రశ్నించారు. ఈ ఘటనతో మున్నూరు కాపు నేతల అసంతృప్తి, కాంగ్రెస్ లో అసహనం స్పష్టంగా కనిపించింది. ఈ సమావేశం తర్వాత ఏఐసీసీ స్పందన ఇప్పుడు స్థానిక కాంగ్రెస్ నాయకుల్లో ఆందోళన కలిగించింది. పార్టీ పట్ల నిబద్ధత ఉన్న నేతలు మాత్రమే ముందుకు రావాలని, పార్టీ నియమాలను పాటించవలసిన అవసరం ఉందని అధిష్టానం సందేశం పంపినట్లుగా తెలుస్తోంది.
READ MORE: SLBC Tunnel: టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్స్‌కి తీవ్ర ఆటంకం..