వరంగల్ మామునూర్ ఎయిర్పోర్టు ప్రాంగణం దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కార్యకర్తల మద్య తోపులాట జరిగింది. మామునూరు ఎయిర్ పోర్ట్కు ఆమోదం రావడంతో కాంగ్రెస్, బీజేపీ ఆధ్వర్యంలో వేరువేరుగా సంబరాలు చేసుకుంటున్నారు.
BJP: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యవహారం కాంగ్రెస్లో కాకరేపుతోంది. ఆయన బీజేపీకి చేరుతారంటూ ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వాదనల్ని డీకే శివకుమార్ కొట్టిపారేసినప్పటికీ, సొంత పార్టీలోని కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ఆయన మహా కుంభమేళాకు వెళ్లడం, శివరాత్రి రోజున కోయంబత్తూర్లో మతపరమైన కార్యక్రమానికి హాజరుకావడంతో బీజేపీకి దగ్గరవుతున్నారనే వాదన వినిపిస్తోంది.
Himachal: నిధుల లేమితో ఇబ్బందులు పడుతున్న హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీజేపీ ఆరోపణలు గుప్పిస్తోంది. రాష్ట్ర సంక్షేమ పథకాల కోసం ఆలయ ట్రస్టుల నుంచి నిధులు కోరుతోందని ఆరోపించింది. అయితే, దీనిపై ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు మాట్లాడుతూ, ఈ విరాళం స్వచ్ఛందంగా అందించబడిందని, ఇది సుఖ్ ఆశ్రయ్ పథకం కింద అనాథలకు భవన నిర్మాణ సౌకర్యాల కోసం అని చెప్పారు.
ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజాహిత బడ్జెట్ అన్నారు. కమలం వాణి ఎప్పుడూ ప్రజా వాణి.. సమస్యలపై స్పందించడం, ప్రజల మాట వినిపించడం మా పార్టీ విధానం.. రాజకీయంలో మచ్చలేని పార్టీ బీజేపీ అని చెప్పగలం.. వేలెత్తి చూపలేని పార్టీగా మోడీ పాలనలో బీజేపీ ఉందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పేర్కొన్నారు.
శివరాత్రి వేడుకల్లో ఇషా ఫౌండేషన్ అధినేత సద్గురు జగ్గీ వాసుదేవ్తో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ వేదిక పంచుకోవడం రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. సొంత పార్టీ నేతల నుంచి డీకే.శివకుమార్పై తీవ్ర వ్యతిరేక వ్యక్తమైంది.
కేంద్రం-కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా మరోసారి కేంద్రానికి పిట్రోడా కౌంటర్ ఇచ్చారు. కేంద్ర విద్యాశాఖ చేసిన ప్రకటనను తోసిపుచ్చారు. ఫిబ్రవరి 1న ఐఐటీ-రాంచీ విద్యార్థులు, అధ్యాపకులతో వర్చువల్గా శామ్ పిట్రోడా ప్రసంగిస్తున్నారు.
తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రం మారుతోందా? పొలిటికల్ పావులు చిత్ర విచిత్రంగా కదులుతున్నాయా? రెండు జాతీయ పార్టీల నేతల మధ్య ఉన్నట్టుండి మాటల యుద్ధం ఎందుకు మొదలైంది? ఎవరి అంచనాలు ఎలా ఉన్నాయి? ఆవులు ఆవులు పొడుచుకుంటే… దూడలు బలైనట్టు అన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? అసలు తెలంగాణలో మొదలైన కొత్త పొలిటికల్ గేమ్ ఏంటి? తెలంగాణ పొలిటికల్ స్ర్కీన్ మీద సరికొత్త సీన్స్ కనిపిస్తున్నాయి. తమలపాకుతో నువ్వు ఒకటంటే… తలుపు చెక్కతో నే రెండంటానన్నది రాజకీయాల్లో…
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ మరోసారి ‘‘ఖేలా హోబే’’ నినాదంతో బీజేపీకి సవాల్ విసిరింది. 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ముందు మరింత దూకుడుగా రాజకీయ ఆటను ప్రారంభించింది. ఆమె టీఎంసీ కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘ఆట మళ్లీ ప్రారంభమైంది(ఖేలా అబర్ హోబే)’’ అంటూ నినదించారు.
MLC Elections : టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఖమ్మం నగరంలోని రికాబ్ బజార్ పాఠశాల పోలింగ్ బూత్ వద్ద ఉదయం నుంచి ఉద్రిక్తత పరిస్థితి కొనసాగుతుంది. మధ్యాహ్నం సమయంలో బీజేపీకి చెందిన నాయకుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పోలీసు వాహనం ముందు బీజేపీ క్యాడర్ బైఠాయించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది . పోలింగ్ బూత్ ముందు ఏర్పాటు చేసుకున్న బీజేపీ, యూటీఎఫ్, పీఆర్టీయూకు సంబంధించిన డెస్కుల వద్ద ప్లెక్సీ విషయంలో వివాదం కొనసాగుతుంది. ఉదయం…
ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల వేదికగా అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సమావేశాలు ప్రారంభమైన దగ్గర నుంచి వాడీవేడీగానే జరుగుతోంది. ఇటీవల గత ప్రభుత్వ పాలనపై కాగ్ రిపోర్టును ముఖ్యమంత్రి రేఖా గుప్తా సభలో ప్రవేశపెట్టారు.