Raja Singh: కాంగ్రెస్ హిందూ వ్యతిరేక పార్టీ అని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తెలిపారు. హిందువులతో పెట్టుకుంటే కేసీఆర్ కు ఏమైందో రేవంత్ రెడ్డికి అదే అవుతుంది.. రేవంత్ 9వ నిజామ్ అని మండిపడ్డారు. హిందూ పండుగలు ఎలా జరుపుకోవాలో మీరు చెబుతారా అని ప్రశ్నించారు. 12 గంటల వరకే చేసుకోవాలి.. గుమి కూడొద్దని పోలీసులు చెబుతున్నారు.. రంజాన్ సందర్భంగా రాత్రి నుంచి ఉదయం వరకు ఎంత న్యూ సెన్స్ అవుతుందో కనిపించడం లేదా.. సౌండ్ పొల్యూషన్ అని మాపై కేసులు పెట్టారు.. ఉదయం నుంచి సాయంత్రం వరకు కోర్టులో కూర్చొంటున్నాం.. సౌండ్ పొల్యూషన్ పైన ఒక్క మజీద్ అధికారి పైనా కేసులు పెట్టారా అని అడిగారు. హోలీ పండుగ ఉంది.. ముస్లింలు ఇంట్లోనే నమాజ్ చేసుకోవాలని చెబితే బాగుంటుంది.. తెలంగాణ హిందువులారా ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్ ల్లో మన పండుగలు ఎంత ఘనంగా జరుగుతున్నాయో చూడండి అని రాజాసింగ్ పేర్కొన్నారు.
Read Also: Sunita Williams: సునీతా విలియమ్స్ రాకకు మళ్లీ బ్రేక్! కారణమిదే!
ఇక, తెలంగాణలో హిందువులు సేఫ్ గా ఉండాలంటే బీజేపీ గవర్నమెంట్ రావాలని రాజాసింగ్ తెలిపారు. కేంద్ర అధికారులు దీనిపై ఆలోచన చేయాలి.. రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ వస్తే ఆ ప్రభుత్వం ముఖ్యమంత్రితోని సీక్రెట్ మీటింగ్లు పెట్టుకుంటారు.. అట్లాంటి మీటింగ్లు పెట్టుకుంటే బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తదా అని ప్రశ్నించారు. కేంద్రంలోని అధికారులు గమనించాలి.. ఇది నా పార్టీ నా అయ్యా పార్టీ అనేవోలు తెలంగాణలో చాలా మంది ఉన్నారు.. వాళ్లకి రిటైర్ చేస్తేనే బీజేపీకి మంచి రోజులు తెలంగాణలో వస్తది.. ఇది నేను కాదు ప్రతి ఒక్క బీజేపీ సీనియర్ అధికారులు కార్యకర్తలు ఇదే అనుకుంటున్నారు గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పుకొచ్చారు.