బీజేపీ కారణంగా హీరోయిన్ ప్రీతి జింటాకు చెందిన రూ.18 కోట్ల బ్యాంక్ రుణం రద్దైందని కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఇటీవలే న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ మూసేశారు.
కేంద్రమంత్రి బండి సంజయ్‌పై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌తో పోల్చి భారతదేశం గొప్పతనాన్ని తగ్గించొద్దని హెచ్చరించారు. దేశ గౌరవాన్ని తగ్గిస్తున్న బండి సంజయ్‌ను బీజేపీ పెద్దలు నియంత్రించాలని కోరారు. పాకిస్తాన్‌తో పోల్చి దేశాన్ని కించపరచడం తప్ప.. మీరు దేశానికి చేసింది ఏమీ లేదని విమర్శించారు. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి భారతీయులంతా నా సోదరులే అన్న మీరు, భారత రాజ్యాంగాన్ని కాపాడతానని చెప్పిన మీరు.. అధికారం కోసం విద్వేష ప్రసంగాలు చేయడం అవసరమా?…
తెలంగాణలో జనాభాకి అనుగుణంగా లెక్కలు లేవని.. 4.30 కోట్లు జనాభా ఉంటే 3.70 కోట్లు మాత్రమే చూపెట్టారని కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ సర్వే చేస్తే 52 శాతం బీసీ జనాభా ఉంటే.. కాంగ్రెస్ సర్వేలో 46 శాతం మాత్రమే ఉందని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకూ నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణకు కేంద్రం 1.08 లక్షల కోట్లు ఇచ్చిందని, నిరూపిస్తాం…
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్.. హస్తానికి గుడ్‌బై చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలోనే ఆయన కాషాయ కండువా కప్పుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి తన అవసరం లేకపోతే చెప్పాలని.. తన ముందు చాలా ఆఫర్లు ఉన్నాయని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ఢిల్లీ అసెంబ్లీలో రగడ చోటుచేసుకుంది. బీజేపీ ప్రభుత్వం.. శాసనసభలో గత ప్రభుత్వానికి సంబంధించిన కాగ్ రిపోర్టును సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష ఆప్ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
Bandi Sanjay : ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగమంతా పచ్చి అబద్దాలు, అర్ధ సత్యాలతో నిండిపోయిందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధికి ఓటమి ఖాయమనే భయం ఆయనలో స్పష్టంగా కన్పిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇంటెలిజెన్స్ సహా అన్ని సర్వే సంస్థలన్నీ బీజేపీ గెలుపు తథ్యమని తేల్చేశాయని, కాంగ్రెస్ 3వ స్థానానికి పడిపోతుందని నివేదికలివ్వడంతో దిక్కుతోచని ముఖ్యమంత్రి హడావుడిగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి…
Kishan Reddy : తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమరంలో బీజేపీ తన వ్యూహాన్ని స్పష్టంగా ప్రకటించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మూడు స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ, “1960 నుండి బీజేపీ పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తుంది” అని పేర్కొన్నారు. ఇది పార్టీకి కొత్త పోటీ కాదని, గత అనుభవంతో ఈ ఎన్నికల్లో విజయంపై పూర్తి విశ్వాసం…
CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. పట్టభద్రులు గుండె మీద చేయి పెట్టుకొని ఆలోచించాలని కోరుతూ, బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా, కేటీఆర్, హరీష్ రావు కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించాలనే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మంచిర్యాలలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత పట్టభద్రుల లే కదా. వీరు ఎవ్వరికి ఓటు వేస్తారు?…
Anji Reddy Chinnamail: ఉమ్మడి కరీంనగర్ - నిజామాబాద్ - ఆదిలాబాద్ - మెదక్ నియోజక వర్గాల ఎమ్మెల్సీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తప్పదని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు అర్థమైందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. అధికార పార్టీ (కాంగ్రెస్) తమ ఎమ్మెల్సీ అభ్యర్థులను అరువు తెచ్చుకుందని, 10 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీ (బీఆర్ఎస్)కి బరిలో నిలబడే అభ్యర్థులు కరువయ్యారని సెటైర్లు విసిరారు. బీఆర్ఎస్ హయంలో రాష్ట్రం దివాలా తీస్తే.. కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రి అప్పుల కోసం కేంద్రం చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం…