BJP MP Laxman: తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్రంగా మండిపడ్డారు. పాలన చేతకాక అయోమయ, గందరగోళంతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్ ముసుగులో గత ప్రభుత్వంలోని బీఆర్ఎస్ నేతలు లబ్ధి పొందారు.. ఆ ప్రాజెక్ట్ ఉత్తర భాగం రైతులకు నష్టం చేశారు అని పేర్కొన్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో పార్లమెంట్ స్థానాలు పెరగాలంటే.. పెళ్లైన జంటలు త్వరత్వరగా పిల్లల్ని కనాలని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. త్వరలో కేంద్రం.. డీలిమిటేషన్ చేయబోతుంది. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ స్థానాలు పెరుగుతాయని సూచించింది. అయితే కేంద్ర ప్రకటనపై స్టాలిన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఎన్టీవీతో హరీశ్‌రావు మాట్లాడారు. తమ హయాంలో ఎస్ఎల్బీసీ కోసం రూ.3 వేల కోట్లకుపైగా ఖర్చు చేసి 11 కిలోమీటర్లు తవ్వినట్లు చెప్పారు. ఈ విషయంపై ఎక్కడికైనా చర్చకు రమ్మంటే వస్తానన్నారు. తాను చెప్పింది తప్పు అని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు.
వనపర్తి వేదికగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. "రేవంత్ రెడ్డి నీకు చేతనైతే కృష్ణ నీటి విషయంలో చంద్రబాబుపై యుద్ధం ప్రకటించు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడికి పోయినా పాత చింతకాయ పచ్చడి వాగుడే వాగుతున్నాడు. కేసీఆర్ ను తిట్టడం తప్ప ప్రజలకు పనికొచ్చే విషయం ఒక్కటి కూడా మాట్లాడడం లేదు. కన్నతల్లికి పట్టెడన్నం పెట్టలేనోడు పినతల్లికి బంగారు గాజులు కొనిస్తాడట. వంద రోజుల్లో అమలు చేస్తామన్న…
మోడీ పాపం చాలా మంచిగానే ఉన్నారని.. ఆయన మనకు అంతో ఇంతో చేయాలని ముందుకొస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "మోడీ తెలంగాణ పట్ల సానుభూతితో ఉన్నారు. కానీ కిషన్ రెడ్డి నే ఓర్వలేక పోతున్నారు. సైంధవుడిగా కిషన్ రెడ్డి ఉన్నాడు." అని వ్యాఖ్యానించారు. వనపర్తి తనకు చదువుతో పాటు సంస్కారం నేర్పించిందని ముఖ్యమంత్రి అన్నారు. వనపర్తి విద్యార్థిగా…
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు ఇంట్లో కాపు నేతల సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి కాంగ్రెస్‌తో పాటు బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కూడా హాజరైనట్లు తెలిసింది. ప్రతిపక్ష పార్టీలను పిలవడమేంటని మీనాక్షి నటరాజన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ అంశంపై తాజాగా వీహెచ్ స్పందించారు. "ఒకరిద్దరికి కోపం రావచ్చు. నిన్న మీటింగ్ లో సీఎం నీ.. ప్రభుత్వాన్ని ఎవరు తిట్టలేదు. జనాభా లెక్క కొంచెం తక్కువ ఉందని అన్నారు. దాని మీద…
DK Shivakumar: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ముందు కమలం పార్టీ తన ఇంటిని చక్కదిద్దుకోనివ్వండి.. ఆ పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 6 నుంచి నిర్వహించే పదవ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలను మధ్యాహ్నం 12.15 నుంచి 3.15 గంటలకు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయం సమంజసం కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. "ఈ సమయంలో విద్యార్థులు, అధ్యాపకులు సహా ప్రతి ఒక్కరూ లంచ్ చేస్తారు. అదే టైంకి పరీక్షలు నిర్వహించి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదు. రంజాన్ సందర్భంగా ముస్లింలకు సాయంత్రం 4…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత వారం రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై.. వ్యక్తిగతంగా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఎమ్మెల్సీ చింతపండు నీవన్ (తీన్నార్ మల్లన్న)కు బిగ్ షాక్ తగిలింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఇటీవల బీసీ సభలో ఓ వర్గంపై మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలాకు పాల్పడుతున్నట్లు హైకమాండ్ గుర్తించింది.