తెలంగాణకు గత మూడేళ్లలో 7 కొత్త జాతీయ రహదారులు ప్రకటించినట్టు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. తెలంగాణకు గత మూడేళ్ల కాలంలో కొత్తగా మంజూరైన జాతీయ రహదారుల వివరాలతోపాటు రహదారుల నిర్మాణంలో భూ సేకరణ సమస్య ఏర్పడితే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటనే అంశంపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇవాళ పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు నితిన్ గడ్కరీ. 2020 జూన్ 29న 90 కిలోమీటర్ల మేరకు…
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్… ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు.. ఇవాళ ఓబీసీ సంక్షేమ పార్లమెంటరీ కమిటీ సభ్యులతో కలిసి ప్రధాని చెంతకు వెళ్లారు బండి సంజయ్.. జాతీయస్థాయి వైద్య విద్యా కోర్సుల్లో ఓబీసీలకు 27 శాతం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని పేర్కొంటూ ప్రధానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. గత 40 ఏళ్లలో ఏ ప్రభుత్వం తీసుకోని సాహసోపేత…
కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాత్రకు సిద్ధం అవుతున్నారు.. యాత్ర ఏర్పాట్లపై భారతీయ జనతా పార్టీ నేతలు సమావేశం నిర్వహించారు… ఈ యాత్రకు స్వాగత కార్యక్రమాలు, చిన్న చిన్న సభలు, బైక్ ర్యాలీలు, కార్యకర్తల సమ్మేళనాలు.. నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు… తన యాత్రలో భాగంగా వనజీవి రామయ్య, చింతకింది మల్లేశంలను కలవనున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ఇక, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కిషన్‌రెడ్డి టూర్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను పరిశీలిస్తే.. తిరుమల శ్రీవారిని, బెజవాడ…
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్‌కు మంజూరు చేసిన ప్రత్యేక హోదా లేదా స్వయంప్రతిపత్తిని భారత ప్రభుత్వం రద్దు చేసింది. ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చినా.. స్థానిక పార్టీలు పూర్తిస్థాయిలో వ్యతిరేకించినా.. 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దు చేసింది ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్.. దీనిపై దేశవ్యాప్తంగా కొన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభించగా.. మరికొందరు వ్యతిరేకించారు.. ఇక, కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించినా.. గట్టిగా ఈ…
కరీంనగర్లో 9 గ్రానైట్ పరిశ్రమలకు నోటీసులు జారీ చేసింది ఈడీ.. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఫిర్యాదుతో నోటీసులు జారీ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. ఫెమా నిబంధనలు ఉల్లంఘించి విదేశాలకు గ్రానైట్ ఎగుమతి చేశారని ఫిర్యాదు చేశారు బండి సంజయ్.. దీంతో రంగంలోకి దిగిన ఈడీ… ఎంత గ్రానైట్ ఎగుమతి చేశారో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. కాగా, కరీంనగర్ నుంచి కాకినాడ, కృష్ణపట్నం మీదుగా విదేశాలకు గ్రానైట్ ఎగుమతి చేసినట్లు…
గ్రూప్ రాజకీయాలకు భారతీయ జనతా పార్టీలో స్థానం లేదని స్పష్టం చేశారు ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ… మహబూబ్ నగర్ జిల్లా కార్యాలయంలో బీజేపీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ…కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు.. పార్టీ కార్యకర్తలకు, సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆమె.. గ్రూప్ రాజకీయాలకు బీజేపీలో స్థానం లేదు… పార్టీ కోసం కష్ట పడే ప్రతి ఒక్క కార్యకర్తకు గుర్తింపు…
పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి చేదు అనుభవం ఎదురైంది… త్రిపురలో పర్యటిస్తున్నారు అభిషేక్ బెనర్జీ.. అయితే, ఆయన కాన్వాయ్‌పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి దాడికి పాల్పడ్డారు.. వారు బీజేపీ జెండాలను పట్టుకుని ఉన్నారు.. అయితే, తనపై దాడికి పాల్పడింది బీజేపీ నేతలేనంటూ సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు అభిషేక్ బెనర్జీ.. బీజేపీ నాయకత్వంలోని త్రిపురలో ప్రజాస్వామ్యం ఇలా ఉంది అంటూ మండిపడ్డ ఆయన.. విప్లవ్ దేవ్ మీరు…
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి అసలైన ప్రతిపక్షం తామేనని.. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టబోతున్నట్టు బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.. అందుకు అనుగుణంగా పార్టీ శ్రేణుల్లో ఊపుతెచ్చేందుకు.. కొత్తవారిని ఆకర్షించేందుకు ప్లాన్ చేస్తున్నారు.. ప్రజలతో మమేకం అవుతూ.. సమస్యలు తెలుసుకుంటూ.. పాదయాత్ర నిర్వహించాలని తలపెట్టారు బీజేపీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. అయితే, ప్రస్తుతానికి ఆయన పాదయాత్ర వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 9వ తేదీ నుంచి…