తెలంగాణకు రూ.38,114 కోట్ల ‘ముద్ర’ రుణాలు మంజూరు అయ్యాయి. 47.26 లక్షల ఖాతాల్లోకి నిధులు జమ కానున్నాయి. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్దిక శాఖ సహాయ మంత్రి సమాధానం ఇస్తూ తెలంగాణ విషయానికొస్తే… “ప్రధాన మంత్రి ముద్ర యోజన” ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు గత ఆరేళ్లలో మొత్తం 47,26,819 మంది ఖాతాలకు రూ.38,114 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. వీటిలో 37,46,740 మంది రూ.50 వేలలోపు…
ఎదుటి వారిని నమ్మించడానికి ‘ఒట్టేసి’ చెబుతారు కొందరు. మరికొన్నిచోట్ల ఇష్టదైవాలపై ప్రమాణాలు చేయిస్తారు. ఒట్లు.. ప్రమాణాలు లేకపోయినా.. ఇటీవల కాలంలో ఆ జాతీయ పార్టీ నాయకుల ఢిల్లీ ప్రయాణం ఇంచుమించు అలాగే ఉందట. పైగా కీలక నేతలు ఎస్కార్ట్‌గా వెళ్లడం ఆసక్తి కలిగిస్తోంది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. బీజేపీ నుంచి నేతలు వెళ్లిపోకుండా ‘ఢిల్లీ టూర్’! తెలంగాణ బీజేపీలో రెండేళ్లుగా వివిధ పార్టీల నుంచి మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు పెద్దసంఖ్యలో చేరారు.…
హుజురాబాద్ నియోజకవర్గంలో పాదయాత్రలో అస్వస్థతకు గురైన బీజేపీ నేత ఈటల రాజేందర్… వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు.. పాదయాత్ర ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్టు ఈటల ప్రకటించారు.. మరోవైపు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈటలను ఇప్పటికే పలువురు నేతలు పరామర్శించగా.. ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రాఘునందర్‌రావు పరామర్శించారు.. ఆయన ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇక, ఆస్పత్రిలో ఈటలను పరామర్శించిన తర్వాత మీడియాకు ఓ వీడియో విడుదల చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్… ఈటల ఆరోగ్య…
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ఇంచార్జ్ మంత్రి కొప్పుల ఈశ్వర్ పలు అభివృద్ధి పనులకు 31.30కోట్ల రూపాయలతో అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్, రైల్వే స్టేషన్ షాపింగ్ కాంప్లెక్స్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సంధర్బంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ… దేశంలో రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చిన మొఖమా బీజేపీ నాయకులది. రెండు వేలు ఇవ్వలేని వాళ్ళు రూ.50లక్షలు కావాలని డిమాండ్ చేయడం సిగ్గు చేటు. జీహెచ్ఎమ్ సి ఎన్నికల్లో బండి సంజయ్ ఏం మాట్లాడిండు.…
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక భావజాలం వ్యాప్తి కోసం, బీజేపీ జెండా ఎగరేయడానికి, నమ్మిన సిద్దాంతం కోసం ఎంతో మంది తమ ప్రాణాలను త్యాగం చేశారు.. వారి బలిదానాలను వృతా కానివ్వం అన్నారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్… వేలాది మంది నక్సలైట్ల చేతిలో తమ ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది.. ఆ మహనీయుల బలిదానాలు వృథా కానివ్వం.. వారి స్ఫూర్తితో జాతీయవాద భావజాలాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారాయన.. హైదరాబాద్‌లో నిర్వహించిన బీజేపీ మహిళా మోర్చా…
జీఎస్టీ రేట్లను రేషనలైజ్ చేయాలంటూ చాలా రోజులుగా ప్రజలను నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. వ్యాపారవర్గాలు కూడా ఈ విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కోరుతూనే ఉన్నాయి. అలాంటివారందరికీ కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ తీపి కబురు చెప్పారు. ప్రభుత్వ అజెండాలో జీఎస్టీ రేట్ల రేషనలైజేషన్ ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఐదు శ్లాబ్స్‌లో ఉన్న జీఎస్టీ రేట్లను మూడు స్లాబ్స్‌కు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. జీఎస్టీలో మూడు రేట్ల వ్యవస్థ చాలా…
ప్రజా దీవెన పాద యాత్రలో భాగంగా నేడు వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ… మంత్రులకే దొరకని సీఎం ఎంపీటీసీ, సర్పంచ్ లతో ఫోన్ లో మాట్లాడుతున్నాడు. మన దెబ్బ అలా ఉంది అన్నారు. ఇంత మంది మంత్రులు, ఎమ్మెల్యే లు నా మీదకు వస్తున్నారు. ఇది గడ్డి పోస కాదు, గడ్డపార. పొలిసులకు కూడ వారి మనసులో ఈటెల రాజేందర్ గెలువాలని ఉంది. నేను అందరికి సహాయం చేసే వాడిని.…
తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద బడుగుల ఆత్మగౌరవ పోరు ధర్నా జరిగింది. ఈ ధర్నాసభలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పలు విమర్శలు చేశారు. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్‌ను, ఫామ్ హౌస్‌ను లక్ష నాగళ్లతో దున్నుతామని, ఆ భూమిని ప్రజలకు పంచుతామని అన్నారు. పోడు భూములను పరిష్కరిస్తామని చెప్పిన కేసీఆర్, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. దళితులకు మూడు ఎకరాల భూమిని…
కడపజిల్లా రాజుపాలెం మండలం అయ్యవారిపల్లెలో బీజేపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కత్తులతో ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. వైసిపికి చెందిన ముగ్గురు, బిజెపీకి చెందిన ఆరుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో బిజెపీకి చెందిన ముగ్గురు కార్యకర్తల పరిస్థితి విషమంగా ఉంది. బీజేపీ కార్యకర్తలు గోపు ప్రసాద్, చిన్న నరసింహులు, పెద్ద నరసింహులు గాయపడ్డారు. వైసీపీ కార్యకర్తలు నరేంద్ర, ఆంజనేయులు గాయపడగా…ఈ ఘర్షణలో గ్రామ వాలంటీర్ వెంకటేష్ కూడా గాయాలయ్యాయి. read also : హైదరాబాద్…