పెద్దనేతలు చేరితే పార్టీ బలోపేతం అవుతుందని సంతోషిస్తారు. కానీ.. ఆ శిబిరంలో రివర్స్. ఒక మాజీ మంత్రి చేరితే.. ఇద్దరు మాజీ మంత్రులు గుడ్‌బై చెప్పేశారు. పార్టీలోనూ అంతర్గత చిచ్చు రగిలిందట. ముఖ్య నాయకుల మధ్యే దూరం పెరిగిందని టాక్. ఆ పార్టీ ఏంటో.. లెట్స్ వాచ్! బీజేపీని వీడిన ఇద్దరు మాజీ మంత్రులు! బీజేపీలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేరిక తర్వాత కాషాయ శిబిరంలో ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఆయన కమలం తీర్థం పుచ్చుకునే సమయంలో…
ఐదురోజుల ఢిల్లీటూర్‌లో బెంగాల్ సీఎం మమత బిజీబిజీగా గడుపుతున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై పోరాటంలో విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బుధవారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, రాహుల్ గాంధీలతో సమావేశమైన మమత… తమ మధ్య సమావేశం పూర్తి సానుకూలదోరణిలో జరిగిందన్నారు. దీని ఫలితాలు భవిష్యత్తులో కనిపిస్తాయన్నారు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ బంపర్ విక్టరీ తర్వాత తొలిసారిగా మమత.. సోనియాతో సమావేశమయ్యారు. ఢిల్లీలో వరుసగా విపక్షనేతలతో మమత సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్న…
కర్నాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప రాజీనామా తరువాత కొత్త సీఎం ఎవరు అనే దానిపై నిన్నటి నుంచి కసరత్తులు జరుగుతున్నాయి. నిన్నటి రోజున బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంశాఖ మంత్రి అమిత్ షాలు పార్లమెంట్ ఆవరణలో భేటీ ఆయ్యి చర్చించారు. అధిష్టానం ముందుకు వచ్చిన పేర్లను పరిశీలించారు. అనంతరం సీఎం అభ్యర్థి ఎవరు అని నిర్ణయించే బాధ్యతను కేంద్ర మంత్రులైన ధర్మేంద్ర ప్రదాన్, కిషన్ రెడ్డిలకు అప్పగించింది కేంద్రం. కాసేపట్లో ఈ ఇద్దరి కేంద్ర మంత్రుల…
కర్నాటక ముఖ్యమంత్రి పదవికి యడియూరప్ప రాజీనామా చేయడంతో.. కొత్త సీఎం ఎంపికపై కసరత్తు ప్రారంభించింది భారతీయ జనతా పార్టీ అధిష్టానం.. యడియూరప్ప వారసుడి ఎంపిక బాధ్యతలను కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, కిషన్‌రెడ్డికి అప్పగించారు.. సీఎం ఎంపిక ప్రక్రియ ఇంచార్జీలుగా ఇద్దరు కేంద్రమంత్రులను నియమించడంతో.. ఢిల్లీ నుంచి బెంగళూరుకు బయల్దేరారు.. ఇవాళ సాయంత్రం కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరపనున్నారు ఇరువురు నేతలు.. సాయంత్రం 7 గంటలకు బీజేఎల్పీ సమావేశం కానుంది. ఇక, ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించిపై…
ఇతర పార్టీల నుంచి ఎవరైనా వలస వస్తే.. వారి స్థాయిని భట్టి గౌరవం ఇస్తాయి చేర్చుకున్న పార్టీలు. అక్కడ మంచి గుర్తింపు లభిస్తుందని ఆశిస్తారు నాయకులు. కానీ.. తెలంగాణ బీజేపీలో చేరిన మాజీ ప్రజాప్రతినిధులకు సీన్ రివర్స్‌లో ఉందట. మెడలో కండువా తప్ప చేతుల్లో పార్టీ పదవి ఒక్కటీ లేదు. బీజేపీ నుంచి ఒక్కో వికెట్ పడిపోతున్న సమయంలో వలస నేతలపట్ల కాషాయ శిబిరం ఆలోచన శ్రేణులను కలవర పెడుతోందట. మీటింగ్‌కు వస్తే స్టేజ్‌పై నో కుర్చీ!…
ఆయనో అధికార పార్టీ ఎమ్మెల్యే. నాలుగుసార్లు గెలిచినా ఎక్కడా వివాదాస్పదం కాలేదు. తాను అనుకున్నది అనుకున్నట్టు చేయడం అలవాటైన ఆ ఎమ్మెల్యే.. ఇప్పుడు అత్యంత వివాదంలో చిక్కుకున్నారు. ప్రెస్‌మీట్ పెట్టి మరీ కామెంట్స్ చేశారు. ఏకంగా బీజేపీకి, హిందుత్వ వాదులకు టార్గెట్ అయ్యారు. read also : హుజురాబాద్‌లో హరీష్ అడుగుపెడితే ఉత్కంఠ తప్పదా? ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి లౌక్యం తెలియదా? కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి జిల్లాలో మినహా రాష్ట్రంలో తెలిసిన వారు తక్కువ. 175…
రాజీనామా వ్యవహారంపై వస్తున్న వార్తలను ఖండిస్తూనే వచ్చిన కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప.. చివరకు రాజీనామా చేశారు.. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ను కలిసిన ఆయన రాజీనామా పత్రాన్ని అందజేశారు. అయితే, కొత్త సీఎంను ఎన్నుకునే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని యడియూరప్పను కోరారు గవర్నర్.. ఇక, యడియూరప్ప వారసుడు ఎవరు? కర్ణాటక సీఎం పీఠంపై కూర్చోబోతున్న కొత్త వ్యక్తి ఎవరు అనేదానిపై బీజేపీ అధిష్టానం తీవ్రమైన కసరత్తు చేస్తోంది.. ఇదే సమయంలో.. యడియూరప్పకు బీజేపీ అధిష్టానం…
ఐదు రోజుల పర్యటన కోసం సోమవారం హస్తిన చేరుకున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ.. బిజీబిజీగా గపడనున్నారు.. ఈ టూర్లో విపక్ష నేతలతో పాటు.. ప్రధాని మోడీని కలుస్తారని తెలుస్తోంది. బీజేపీ వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్షాన్ని ఏర్పాటు చేయాలని మమత భావిస్తున్నట్లు సమాచారం. అందుకే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు ఇతర విపక్ష నేతలను కలుస్తారని ప్రచారం జరుగుతోంది. బెంగాల్ సీఎంగా ముచ్చటగా మూడో సారి విజయం సాధించిన దీదీ.. ఎన్నికలు…
ఐదు రోజుల పర్యటన కోసం మమత బెనర్జీ ఢిల్లీకి చేరుకున్నారు. ఈ టూర్లో విపక్ష నేతలతో పాటు.. ప్రధాని మోడీని కలుస్తారని తెలుస్తోంది. బీజేపీ వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్షాన్ని ఏర్పాటు చేయాలని మమత భావిస్తున్నట్లు సమాచారం. అందుకే, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు ఇతర విపక్ష నేతలను కలుస్తారని ప్రచారం జరుగుతోంది. జులై 28న ప్రధాని మోడీని, రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌ను కలవనున్నారు మమతా బెనర్జీ.. అయితే, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి…