త్వరలోనే కర్ణాటక రాష్ట్రంలో హనేగల్, సిందగీ నియోజక వర్గాలకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో బీజేపి తప్పకుండా గెలిచి పట్టు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప తప్పుకున్నాక జరగబోతున్న ఉప ఎన్నికలు కావడంతో ఎలాగైనా సరే గెలిచి పట్టు నిరూపించుకోవాలి. ఇది ఆ పార్టీకి అగ్ని పరీక్ష లాంటివి. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని యడ్యూరప్ప, జగదీశ్ షెట్టర్, డీవీ సదానంద గౌడ, నళిన్ కుమార్ కటిల్ లతో నాలుగు బృందాలను…
పశ్చిమ బెంగాల్‌లోని భవానీపూర్ కు ఈనెల 30 వ తేదీన ఉప ఎన్నిక జరగబోతున్నది. ఈ ఉప ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించేందుకు బీజేపీ శతవిధాల ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టింది. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే, భవానీ పూర్ నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలో ఉన్నారు. కొన్నినెలల క్రితం జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సిట్టింగ్ స్థానం భవానీ పూర్…
అసెంబ్లీ ఎన్నికల తర్వాత పశ్చిమ బెంగాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. మరోసారి టీఎంసీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత.. వరుసగా భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు పార్టీకి గుడ్‌బై చెప్పి.. మళ్లీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.. దీంతో.. నష్టనివారణ చర్యలు చేపట్టింది బీజేపీ అధిష్టానం.. పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్‌గా ఉన్న దిలీప్ ఘోష్‌పై వేటు వేసింది.. ఆయన స్థానంలో ఎంపీ సుకంత మజుందర్‌ను నియమించింది. కాగా, బెంగాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీని…
ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాయని ఫైర్ అయిన మంత్రి కేటీఆర్.. ఇప్పటి వరకు అన్నీ ఓపికగా భరించాం.. ఇక, నోటికిఏదివస్తే అది మాట్లాడితే.. రాజద్రోహం కేసులు పెడతామని హెచ్చరించిన సంగతి తెలిసిందే.. అయితే, దమ్ముంటే నా మీద రాజద్రోహం కేసు పెట్టాలి అంటూ సవాల్ చేశారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. తన పాదయాత్రలో భాగంగా.. తాడ్వాయిలో నిర్వహించిన సభలో మాట్లాడిన ఆయన.. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే రాజద్రోహం కేసు పెడతారా?…
తెలంగాణలో ఇప్పుడు వైట్ ఛాలెంట్ హాట్ టాపిక్‌గా మారిపోయింది.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి సవాల్ విసిరితే.. ఆ సవాల్‌ను స్వీకరించిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి… బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీఎస్పీ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌లకు వైట్ ఛాలెంజ్ విసిరారు.. అయితే, మాజీ ఎంపీ కొండా ఛాలెంజ్‌ను స్వీకరిస్తూనే.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. బాగా బలిసినోడు,…
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు నిరసనగా ఐక్యపోరాటాలు చేయాలని తెలంగాణ ప్రతిపక్షాలు నిర్ణయించాయి. గాంధీభవన్‌లో జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో ఫోర్ పాయింట్ ఫార్ములాను ప్రకటించారు. పోడుభూములతో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఉమ్మడిగా కార్యక్రమాలు చేపడతామన్నారు నేతలు. తెలంగాణలో భూసమస్యలు, ధరణి వెబ్ సైట్ లోపాలపై సీరియస్ గా పోరాటం చేస్తామని ప్రతిపక్షాలు ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరికి నిరసనగా ఐక్య ఉద్యమాలు చేస్తామని తెలిపాయి. గాంధీభవన్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిపక్షాల…
పంజాబ్ కాంగ్రెస్ కొత్త ముఖ్యమంత్రిగా సుఖ్జిందర్ సింగ్ రణ్‌దవాను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. అమరీందర్ సింగ్ రాజీనామా చేసిన తరువాత సిద్ధూపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. సిద్దూకి, పాక్ పీఎం, ఆర్మీ చీఫ్‌కి మద్య మంచి సంబంధాలు ఉన్నాయని, పాక్ కు పంజాబ్ ఆయుధంగా మారుతుందేమో అనే భయం కలుగుతుందని, సిద్ధూ సీఎంగా ఎంపికైతే పంజాబ్‌లోకి పాక్ ఆయుధాలు వస్తాయని తద్వారా దేశంలో కలహాలు రేగే అవకాశం ఉందని అమరీందర్ సింగ్…
ఆ అధికారపార్టీ ఎంపీ ఆల్‌రౌండర్ ప్రతిభ కనబరుస్తున్నారా? సొంత సామాజికవర్గమే కావడంతో పక్క నియోజకవర్గ ఎంపీతో స్నేహబంధాన్ని బలోపేతం చేస్తున్నారా? ఇదంతా సేఫ్ గేమ్‌లో భాగమా లేక.. భవిష్యత్ రాజకీయ వ్యూహమా? సొంత పార్టీలోనూ అనుమానాలకు బీజం పడిందా? ఎవరా అధికార పార్టీ ఎంపీ? ఏంటా స్నేహగీతం..! ఎంపీ పాటిల్ కొత్త స్నేహాలపై చర్చ! బీబీ పాటిల్. జహీరాబాద్ ఎంపీ. టీఆర్ఎస్ నుంచి వరసగా రెండోసారి గెలిచారు. రాజకీయాలతో సంబంధం లేకపోయినా.. ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే ఎన్నికల్లో…
నిర్మల్ సభలో బీజేపీ అగ్రనేత అమిత్ షా.. వైరిపక్షాలకు చురకలు వేశారా? తెలంగాణ కమలనాథులు ఆశించింది జరిగిందా? కాషాయ శ్రేణుల్లో ఉత్సాహం నింపారా లేదా? షా పర్యటనపై బీజేపీ శ్రేణుల్లో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్! అమిత్ షా మాటలు చురుకు పుట్టించాయా? తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్‌లో ఏర్పాటు చేసిన సభకు వచ్చారు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ కార్యక్రమానికి భారీగా జనాన్ని సమీకరించేందుకు బీజేపీ నేతలు శ్రమించారు.…
బీజేపీ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోందా? అంటే అంత అవుననే సమాధానం విన్పిస్తోంది. నిన్నటి వరకు బీజేపీ అధిష్టానం వరుసబెట్టి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను మార్చేసింది. నరేంద్ర మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఏకంగా ఆరుగురు సీఎంలను మార్చివేసింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో జరుగబోయే ఎన్నికలను బీజేపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థమవుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానం పంజాబ్ లో బీజేపీ తరహా ఫార్మూలానే ఫాలో అవుతోంది. అక్కడి సీఎంగా ఉన్న కెప్టెన్ అమరీందర్ సింగ్‌పై వేటు వేసింది.…