పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి మరోషాక్ తగిలింది. ఆపార్టీ అసన్సోల్ ఎంపీ బాబుల్ సుప్రియో ఈరోజు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈరోజు ఉదయం ఆయన తృణమూల్ కండువా కప్పుకున్నారు. 2019 ఎన్నికల తరువాత బాబూలాల్ సుప్రియో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇటీవలే జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి దక్కకపోవడంతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటానని, రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని ప్రకటించారు. అయితే, ఈనెలలో బెంగాల్లో మూడు అసెంబ్లీ…
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణం లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు మంత్రి గంగుల కమలాకర్. అనంతరం ఆయన మాట్లాడుతూ… హుజూరాబాద్ మున్సిపాలిటీకి 50 కోట్లతో అభివృద్ది పనులు చేస్తున్నాం అని తెలిపారు. హుజూరాబాద్ నుండి సైదాపూర్ రోడ్డు కు అరు కోట్ల తో పనులు ప్రారంభం ఉన్నాయి. ఆరు సార్లు గెలిచిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎందుకు అభివృద్ది చేయలేదు. కరీంనగర్ లో వేసిన రోడ్ల లాగా హుజూరాబాద్ రోడ్లను అధునికరిస్తం అని…
గత మూడు నెలలుగా హుజూరాబాద్లో ప్రచార హోరు లేని రోజు. ప్రధాన పార్టీల సందడే సండది. అయితే ఉన్నట్టుండి నియోజకవర్గం సైలెంట్ అయ్యింది. టిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు సడన్గా నియోజకవర్గాన్ని వీడారు. అక్కడి వీధులు..సందులు ..గొందుల్లో నిశ్శబ్దం ఆవరించింది. ఇక్కడ ప్రచారం చేస్తోన్న బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యక్రమాలలో పాల్గొనేందుకు నియోజకవర్గం దాటి వెళ్లటమే ఈ సైలెన్స్కు కారణం. అప్పటి వరకు అక్కడి రోడ్ల మీద హల్ చల్ చేసిన…
ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… అవసరం అయితే రాజద్రోహం కేసులు పెడతామని హెచ్చరించారు.. తెలంగాణ భవన్లో మీడియా చిట్చాట్లో మాట్లాడిన ఆయన.. మేం ప్రభుత్వoలో ఉన్నాం.. చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం.. కానీ, ప్రతిపక్షాలకు పని లేదు.. ఒకరు పాదయాత్ర చేస్తున్నారు.. ఒకరేమో నేనున్నాని చెప్పుకోవడానికి హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు.. ఇక, తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ, జన సంఘ్ ఉందా..? అని ప్రశ్నించారు కేటీఆర్.. చరిత్రకు మతం…
ఈటల రాజేందర్.. బీజేపీలో చేరినప్పటి నుంచి.. పార్టీలో కుదురుకోవడానికి సమయం తీసుకున్నారు. ప్రారంభంలో.. కనీసం జాతీయ అధ్యక్షుడితో కండువా వేయించుకోకుండానే పార్టీలో చేరారని.. బండి సంజయ్ తో పాటు.. కిషన్ రెడ్డి.. ఇతర సీనియర్లు ఈటలతో కలిసి నడవడం లేదని.. బీజేపీలో ఈటల ఒంటరి అయ్యారని.. రకరకాల ఊహాగానాలు పుట్టుకొచ్చాయి. వాటిని అధిగమించేందుకు ఈటల చాలా సమయమే తీసుకున్నారు. ఆ శ్రమకు.. నిర్మల్ సభ రూపంలో.. ఈటల ప్రతిఫలం అందుకున్నారు. పార్టీ అగ్రనేత, ప్రధాన వ్యూహకర్త, ప్రధాని…
గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లు గెలిచాం.. మూడు చోట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాం.. కానీ, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ఎంపీ సీట్లు బీజేపీయే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా… నిర్మల్లో బీజేపీ ఏర్పాటు చేసిన తెలంగాణ విమోచన దినోత్సవ సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు విమోచన శుభాకాంక్షలు తెలిపారు.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తర్వాత…
కాంగ్రెస్ పూర్వీకుల ఆస్తిని బీజేపీ దొంగతనం చేస్తుందని ఆరోపించారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.. సెప్టెంబర్ 17ను విలీన దినోత్సవంగా నిర్వహిస్తోంది కాంగ్రెస్ పార్టీ.. గాంధీ భవన్లో జెండా ఎగరేసిన రేవంత్ రెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ స్వతంత్ర పోరాటానికి అప్పటి ప్రధాని నెహ్రూ సహకరించారని తెలిపారు.. హోంమంత్రికి ప్రత్యేక నిర్ణయాలు ఉండవు.. ఆపరేషన్ పోలో నిర్ణయం నెహ్రూదేనని స్పష్టం చేశారు.. కానీ, కొందరు ఇది హోం మంత్రి నిర్ణయంగా చిత్రీకరిస్తున్నారన్న ఆయన.. కాంగ్రెస్ పూర్వీకుల…
కేంద్ర ప్రభుత్వం తరపున తెలంగాణ ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రజలకి ఈ రోజు కన్నా పండుగ మరొకటి ఉండదు. 17 సెప్టెంబర్ చరిత్రాత్మక రోజు అధికారికంగా నిర్వహించకుండా కాంగ్రెస్, తెరాస లు అన్యాయం చేస్తున్నాయి… ఇది దుర్మార్గం. ఇప్పటికైన కేసీఆర్ తప్పును తెలుసుకొని అమరుల ఆత్మ కు శాంతి చేకూరేలా ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని అన్నారు. రజాకార్ల నేత కాశిం రజ్వి పెట్టిన పార్టీ ఎంఐఎం. మజ్లీస్ కనుసైగల్లో కాంగ్రెస్…
కేంద్ర హోంమంత్రి అమిత్షా.. రేపు నిర్మల్ వస్తున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. అమిత్షా పర్యటనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు కమలనాధులు. వెయ్యి ఉరుల మర్రి సమీపంలో భారీబహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే సభాస్థలిని కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకొని కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాయి. ఢిల్లీ నుంచి నాందేడ్ రానున్న ఆయన.. అక్కడ నుంచి నిర్మల్ వస్తారు.. వెయ్యి…