కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మాజీ మంత్రి డీకే అరుణ మాట్లాడుతూ… సామాజిక వర్గం తలుచుకుంటే కానిదంటూ ఏదీ లేదు. మనం అనుకున్నది సాధించాలనే సత్తా సామాజికవర్గానికి ఉన్నది. క్యాడేట్లను చూసి కాదు కేసీఆర్ ను చూసి ఓటెయ్యండి అని అంటున్నారు.. ఈటల రాజేందర్ లాంటి వ్యక్తులను అవమానించిన కెసిఆర్ కు మామూలు ఎమ్మెల్యేలు ఓ లెక్కన అని తెలిపారు. అయితే తెలంగాణలో కేసీఆర్ డబ్బులు ఇస్తే ఓట్లు పడతాయి డబ్బులు ఇచ్చి ఏమైనా చెయ్యొచ్చు అన్నమాటకు తెరదించాల్సింది హుజురాబాద్ ప్రజలే అని చెప్పిన ఆవిడ ఈటల రాజేందర్ గెలుపు తెలంగాణ గెలుపు అని పేర్కొన్నారు.