పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సిద్ధూ అలక దిగివచ్చి పంజాబ్ కాంగ్రెస్ పీసీసీ పదవిలో కొనసాగనున్నారు. అయితే, సిద్ధూ చెప్పిన విధంగా ప్రభుత్వంలో పాలన సాగితే మరోసారి అంతర్గత విభేదాలు బహిరంగమయ్యే అవకాశం ఉన్నది. కొత్త ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ త్వరలోనే అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉన్నది. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినట్టు ప్రకటించారు. పంజాబ్ కాంగ్రెస్‌లో చీలిక గురించి మాట్లాడారు. ఒకవేళ చీలిక…
త్వరలో జరగనున్న హుజురాబాద్ ఉప ఎన్నికలో నిరుద్యోగులు ప్రధాన భూమిక పోషించనున్నారా? టీఆర్ఎస్కు గట్టి దెబ్బ వారి నుంచే తగలనుందా? షర్మిల పార్టీ నిరుద్యోగులను ఏకం చేసి టీఆర్ఎస్ విజయావకాశాలను దెబ్బతీస్తుందా? రేపటి ఉప ఎన్నికల్లో నిరుద్యోగులు పోషించబోయే పాత్ర గురించి రాజకీయ వర్గాల్లో విశేషంగా చర్చ జరుగుతోంది. షర్మిల పార్టీతో తమకు ఎలాంటి నష్టం ఉండదని టీఆర్ఎస్ అంటోంది. మరోవైపు అది తమకు అనుకూలంగా మారుతుందని బీజేపీ అంచనా వేస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నిరుద్యోగలను…
తెలంగాణలో ఈటల రాజీనామా తర్వాత రాష్ట్ర రాజకీయాలు మొత్తం హుజురాబాద్ చుట్టే తిరుగుతున్నాయి. అయితే నేడు హుజురాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈరోజు నుండి ఈనెల 8 వ తేదీ వరకు అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. హుజురాబాద్ ఆర్డీవో కార్యాలయంలో ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకూ నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. అయితే కోవిడ్ నేపథ్యంలో రిటర్నింగ్ అధికారి వద్దకు వెళ్లేందుకు ఐదుగురికి మాత్రమే అనుమతి ఇచ్చారు. ఇక అభ్యర్థులు…
భవానీపూర్ ఉప ఎన్నిక ముగిసింది. ఈ ఎన్నికల్లో టీఎంసీ తరపున ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తుండగా, బీజేపీ నుంచి ప్రియాంక బరిలో ఉన్నారు. అయితే, ఇది ముఖ్యమంత్రి సిట్టింగ్ స్థానం కావడంతో అమె విజయం నల్లేరుపై నడకే అయినప్పటికీ, బీజేపీ గట్టి పోటి ఇవ్వనుందని సర్వేలు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నిక జరిగే సమయంలో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు మధ్య జరిగిన…
మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్రను హజురాబాద్‌లో ఘనంగా ముగించాలన్నది బీజేపీ ఆలోచన. వారికి ఎన్నికల కోడ్ బ్రేక్ వేసింది. ఇప్పుడేం చేస్తారు? కమలనాథుల ప్లానింగ్ ఏంటి? ఎన్నికల కోడ్‌తో సంజయ్ యాత్ర ముగింపుపై బీజేపీలో చర్చ..! తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగస్టు 28న ప్రజా సంగ్రామ యాత్ర మొదలు పెట్టారు. ఉపఎన్నిక జరగుతున్న హుజురాబాద్‌లో అక్టోబర్ రెండున భారీ రోడ్ షోతో మొదటి విడత యాత్రను ముగించాలని అప్పట్లో అనుకున్నారు. నిన్న మొన్నటి…
జమ్మికుంట పట్టణంలో వడ్డెర సంఘం గర్జన మీటింగ్ కు ముఖ్య అతిధిగా కర్ణాటక మాజీ మంత్రి ఎమ్మెల్యే అరవింద్ లింబావలి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు. అక్కడ మాజీ మంత్రి ఈటల మాట్లాడుతూ… ఎన్ని బెదిరింపులు చేసిన లొంగని జాతి వడ్డెర జాతి. కేసులు పెట్టుకోండి, జెసిబి లు సీజ్ చేసుకోండి కానీ తెరాసా జెండా కప్పుకొనేది లేదని చెప్పారు. దళితులకు అందరికీ దళితబంధు అందించాలి అని, అన్నీ కులాలలో ఉన్న పేద వారికి 10…
అక్టోబర్ 30 వ తేదీన కడప జిల్లాలోని బద్వేల్ కు ఉప ఎన్నిక జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికల్లో జనసేప పార్టీ బద్వేల్ నియోజక వర్గం నుంచి పోటీ చేయబోతున్నట్టు సమాచారం. తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసిన కారణంగా ఈసారి బద్వేల్ నియోజక వర్గంలో పోటీ చేసే అవకాశం జనసేనకు ఇచ్చినట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే, జనసేన నుంచి ఎవరు పోటీలో ఉంటారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
గత కొన్ని నెలలుగా హుజూరాబాద్ …రాష్ట్ర రాజకీయ కేంద్రంగా మారింది. ఈటెల ఎపిసోడ్‌తో ప్రారంభమైన పొలిటికల్ హీట్ వేవ్, షెడ్యూల్ విడుదలతో పీక్ కి చేరింది. హుజురాబాద్ ఉప ఎన్నికను రెండు పార్టీల మధ్య పోరాటంగా జనం భావించట్లేదు. ఈటెల వర్సెస్ కేసీఆర్‌గానే చూస్తున్నారు. రాజకీయ పరిశీలకులు కూడా ఈ మాటే అంటున్నారు. అందుకే ఇది ఈటెల వర్సెస్ కేసీఆర్ గా మారింది. అరుసార్లు ఇక్కడి నుంచి గెలిచిన ఈటెలకు గ్రామ గ్రామాన అనుచర వర్గం వుంది.…
త్వరలో జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులకు ప్రతి ఓటూ కీలకమే. టీఆర్ఎస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్టు సాగనున్న ఈ పోరులో ఎవరు గెలిచినా పెద్ద మెజార్టీ రాకపోవచ్చు. వందల ఓట్ల తేడానే ఉంటుందని పరిశీలకు బావిస్తున్నారు. దుబ్బాక కన్నా ఇంకా టఫ్ ఫైట్ ఉంటుందని బావిస్తున్నారు. నిరుడు జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన రావు, టీఆర్ఎస్ క్యాండిడేట్ సోలిపేట సుజాతా రెడ్డి మధ్య జరిగిన హోరీ హోరీ…
ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా పవన్ కల్యాణ్ నామస్మరణే మార్మోగిపోతుంది. సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెల్సిందే. ఈ సందర్భంగా ఆయన వైసీపీ సర్కారుపై నిప్పులు చెరిగాడు. మీడియా చేస్తున్న అతి, సమాజంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, సినిమా థియేటర్ల ఇబ్బందులు, నిర్మాతలు, సినీ కార్మికుల కష్టాలను ఏకరువు పెట్టారు. కాగా పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వంలోని పెద్దలపై చేసిన…