ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేవారు.. పోలవరం, ఇతర అంశాలపై ఏపీ సర్కార్‌ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించిన ఆయన.. ఈ సందర్భంగా రాజకీయా జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. నేను ఏనాడూ పదవుల కోసం ఎదురు చూడలేదన్న ఆయన.. 2014లో బుచ్చయ్య చౌదరిని పక్కన పెట్టి రాజమండ్రి టికెట్ ఇస్తామని చంద్రబాబు చెప్పినా.. మంత్రి పదవి ఇస్తానన్నా నేను వద్దనానని చెప్పుకొచ్చారు.. ఇక, 2024 తర్వాత నేను రాజకీయాల్లో ఉండబోను అంటూ ప్రకటించారు సోము వీర్రాజు.. తాను, 42 సంవత్సరాలగా రాజకీయాలలో ఉన్నానని గుర్తుచేసుకున్న ఆయన.. ఏపీలో బీజేపీ మాత్రమే ప్రధాన ప్రతిపక్షంగా ఉందన్నారు.. ఇక, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు..
Read Also: గుడ్‌న్యూస్.. త్వరలో భారత్ నుంచి మరో రెండు వ్యాక్సిన్లు..
ఇక, 50 గ్రాముల కొడిగుడ్లు పిల్లలకిస్తే పాదాభివందనం చేస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సోమువీర్రాజు.. నెత్తి మీద చేతులు పెట్టి ముద్దులు పెట్టే బదులు కొడిగుడ్లు ఇవ్వొచ్చుగా..? అని ప్రశ్నించిన ఆయన.. మధ్యాహ్న భోజనం పథకం.. సరిగా అమలు చేయడం లేదని విమర్శించారు. మధ్యాహ్న భోజనం పథకం అమలు చేసే ఐసీడీఎస్ సిబ్బందికి సంబంధించిన యూనియన్లు కమ్యూనిస్టులవేగా.. వాళ్లెందుకు మాట్లాడ్డం లేదని ప్రశ్నించిన ఆయన.. కమ్యూనిస్టులు ఏం చేస్తున్నారు..? కమ్యూనిస్టు నేతలు నోట్లో మట్టి పెట్టుకున్నారా..? అంటూ ఫైర్ అయ్యారు సోము వీర్రాజు.