తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన బీజేపీ.. వివిధ పార్టీలకు చెందిన నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తోంది.. ఇందులో భాగంగా ఇవాళ బీజేపీ గూటికి చేరారు టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు సీహెచ్ విఠల్, పలువురు నాయకులు.. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇంచార్జ్ తరుణ్ చుగ్ , కేంద్ర మంత్రి నఖ్వి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు చింతలగట్టు విఠల్.. పార్టీ సభ్యత్వ నమోదు పత్రాన్ని అందించి, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.. విఠల్ తో పాటు పార్టీలో చందు శ్రీనివాస్ రావు, టి.శ్రీనివాస్ రావు, వివేక్ తదితరులు బీజేపీ కండువా కప్పుకున్నారు.. ఈ కార్యక్రమానికి ఎంపీ అరవింద్, బీజేపీ పార్లిమెంట్ పార్టీ కార్యదర్శి కామర్సు బాల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
Read Also: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉత్తర్వులు జారీ
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేవారు విఠల్.. ఈరోజు చరిత్రలో నేను మరచిపోలేని రోజు. ఈరోజు అంబేడ్కర్ వర్ధంతి.. ప్రపంచంలోనే అత్యంత పెద్ద పార్టీలో చేరి సభ్యత్వం తీసుకోవడం చాలా సంతోషగా ఉందన్నారు.. “గర్ వాపస్” వచ్చినందుకు సంతోషంగా ఉందన్న ఆయన.. రాష్ట్రంలో ఉద్యమకారులకు అన్యాయం జరుగుతున్నది.. ఉద్యమకారులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. తెలంగాణా తెచ్చుకుంది నిధులు, ఉద్యోగాల కోసం… ఉద్యమ సమయములో 1500 మంది విద్యార్ధులు బలిదానాలు చేశారని.. కానీ, తెలంగాణ వచ్చాకా కూడా ఉద్యోగాల కోసం పిల్లలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. 50 లక్షల మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపిన విఠల్.. ప్రభుత్వ అధికార లెక్కల ప్రకారం లక్ష తొంభై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. ఇప్పటి వరకు గ్రూప్-1 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇవ్వలేదు… చాలా మంది నమోదు చేసుకున్నారని తెలిపారు. యూనివర్సిటీల్లో చాలా ఖాళీలు ఉన్నాయి. చాలా మంది విద్యార్థులు చనిపోతున్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు… రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని మండిపడ్డారు. ఇక, బీజేపీతోనే ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందన్న ఆయన.. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే వాళ్లు వెళ్లి టీఆర్ఎస్ లో చేరుతున్నారు.. మంత్రి పదవులు తీసుకుంటున్నారని విమర్శించారు. బండి సంజయ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తేవడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా వెల్లడించారు విఠల్. మరోవైపు కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి మాట్లాడుతూ.. విఠల్ ని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం.. ఒకవైపు వారసత్వ రాజకీయాల పార్టీ, మరోవైపు ప్రజాస్వామ్య పార్టీ.. రాచరిక పార్టీ నుంచి ప్రజాస్వామ్య పార్టీలోకి రావడాన్ని ఆహ్వానిస్తున్నాం అని వ్యాఖ్యానించారు.