రాజ్యసభ ఆరేళ్ళ పదవీకాలం. రాజకీయనేతలకు అదో మంచి అవకాశం. అయితే ఈమధ్యకాలంలో రాజ్యసభ సీట్లు వ్యాపారవేత్తల్ని అందలం ఎక్కిస్తున్నాయి.రాజ్యసభకు ఉత్తరాది రాష్ట్రాల నుంచి తెలుగు నేతలకు అవకాశం ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. కొన్ని చోట్ల ఏకగ్రీవాలు అవుతుంటే.. మరికొన్ని చోట్ల ఎన్నికల అనివార్యం అయ్యేలా వుంది. జూన్ 10 న ఓటింగ్ జరగనుంది. కొంతమంది నేతల్ని ఉత్తరాది నుంచి రాజ్యసభకు పంపాలని కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు. ఏపీ నుంచి పరిశీలనలో సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్,…
ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి చేసింది కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారే.. దీనిపై దమ్ముంటే చర్చకు రావాలంటూ మంత్రి బొత్స సత్యనారాయణకు సవాల్ విసిరారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. విజయనగరం జిల్లా గరివిడిలో బీజేపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం, మంత్రి బొత్సపై తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి బొత్స సొంత జిల్లాలోనే రామతీర్థంలో శ్రీ రాముని విగ్రహాన్ని శిరస్సు ఖండిస్తే దానిపై పోరాడి తిరిగి…
కేంద్రం పెట్రోల్, డిజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గించడంపై మంత్రి హరీష్ రావు స్పందించారు. కేంద్రం పెట్రోల్, డిజిల్ పై బారాణా పెంచి చారాణా తగ్గించిందని విమర్శించారు. మార్చి 2014లో ఉన్న ఎక్సైజ్ సుంకాలను తీసుకువచ్చి మాట్లాడంటూ సవాల్ విసిరారు. ఎందుకోసం బీజేపీ నేతలు పాలాభిషేకాలు చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి పన్నులు పెట్రోల్, డీజిల్ పెంచలేదని అన్నారు. డాక్టర్లు సూది ఇచ్చినట్లు మెల్లిగా కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాయని… డీజిల్, పెట్రోల్ తగ్గించినట్లు…
పెట్రోల్ ధరల తగ్గింపు అంశంపై కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. పెట్రోల్, డిజిల్ ధరలు తగ్గించామని చెబుతూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. అంకెల లెక్కల గారడీ చేస్తున్నారని… కేంద్ర ప్రజలకు ఉపశమనం కల్పించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. గత 60 రోజుల్లో కేంద్రం పెట్రోల్ ధరలను రూ. 10కి పెంచిందని… కేవలం ఇప్పుడు రూ.9.5 తగ్గించిందని, కనీసం పెంచినంత కూడా తగ్గించలేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్ దీప్ సుర్జేవాలా…
కష్టం, శ్రమ మనది.. కేసీఆర్‌ది దోపిడీ అని అందరూ గ్రహించాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్… తెలంగాణ ప్రజల సమస్యలు కేసీఆర్ గాలికి వదిలేశారన్న ఆయన.. ఇక్కడ సమస్యలను ఫేస్ చేసే దమ్ములేక ఇతర రాష్ట్రాలకు ఏదో వెలగ పెడతాను అని వెళ్లారంటూ ఎద్దేవా చేశారు. జాతీయ పార్టీ నేతలు ఇక్కడికి వస్తే టూరిస్ట్ లని అన్నారు… తెలంగాణపై నాకున్న ఆరాటం జాతీయ పార్టీలకు ఉంటుందా? అని ప్రశ్నించారు… ఇప్పుడు ఆ ప్రజల్ని నట్టేట ముంచి పంజాబ్,…
హైదరాబాద్ లోని శేరిలింగంపల్లిలో భారతీయ జనతా పార్టీ నేతలపై దాడి జరిగింది. గోపన్‌పల్లి ప్రాంతంలో ఓ చెరువు స్థలాన్ని కబ్జా వ్యవహారంలో ఈ ఘర్షణ జరిగినట్టుగా తెలుస్తోంది.. శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన నేతలు గజ్జల యోగానంద్, మువ్వా సత్యనారాయణలు తమ అనుచరులతో కలిసి గోపన్‌పల్లి వెళ్లగా.. స్థానికులు వారిపై దాడి చేశారు. బీజేపీ నేతలు చెరువును ఫొటోలు తీస్తుండగా.. స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు.. కబ్జాకు గురైన చెరువు అది…
జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో కోరుట్ల నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ లు కల్వకుంట్ల కవిత, ఎల్ రమణలు హజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. జగిత్యాల జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ గెలుపొందడమే మన ధ్యేయంగా అందరూ ముందుండాలన్నారు. గ్రామాల్లో ప్రధాన కూడళ్ల వద్ద టీఆర్ఎస్ అభివృద్ధిపై కార్యకర్తలు చర్చ జరపండని, తెలంగాణ వచ్చిందే యువకుల కోసం, అలాంటి యువత కోసం ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. అబద్ధానికి…
బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఎలాగైనా రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురేయాలని చూస్తోంది. ఇందు కోసం అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకొనే పనిలో పడింది. వివిధ సందర్భాల్లో తెలంగాణ బీజేపీ నేతలకు ప్రాధాన్యం ఇస్తుంది ఢిల్లీ నాయకత్వం. పార్టీ పదవుల్లో ఇప్పటికే పెద్దపీట వేసింది. మోడీ సర్కార్‌లో కిషన్‌రెడ్డికి కేబినెట్ పదవి ఇచ్చింది. బండారు దత్తాత్రేయను గవర్నర్‌ను చేసింది. ఇదే కోవలో మరికొన్ని పదవులు కట్టబెట్టేందుకు సిద్ధమైందన్న ప్రచారం కాషాయ శిబిరంలో…
ఏపీలో ఇప్పుడు వైసీపీ వర్సెస్ జనసేన వ్యవహారం నడుస్తోంది. గతంలో పొత్తుల గురించి మాట్లాడిన పవన్ పై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ నేతల విమర్శలపై అదేరేంజ్‌లో పవన్ ఫైరయ్యారు. మరోసారి వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ పునరుద్ఘాటించారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలితే అది వైసీపీకే లాభం. అందుకే వైసీపీ వ్యతిరేక ఓటు ఒక కూటమికి పడితే అది లాభం అవుతుంది. ఓటు చీలిపోతే వైసీపీ అభ్యర్ధులు గెలుస్తారు. స్వల్ప ఓట్ల తేడాతో…
సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ పై బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సెటైర్లు పేల్చారు. సీఎం కేసీఆర్ కూట్లో రాయి తీయలేడు కానీ.. ఏట్లో రాయి తీస్తానని ఢిల్లీ వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని ఆయన విమర్శించారు. తెలంగాణలో పెన్షన్లు రెండు మూడు నెలలకు ఒకసారి వస్తున్నాయని… ఉద్యోగాలకు జీతాలు లేవని… మధ్యాహ్న భోజనం వండేవారికి కూడా డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపించారు. రాష్ట్రం అప్పుల పాలు అవుతుంటే…గతి లేక…