తెలంగాణలో చరిత్ర కలిగిన శివాలయ అభివృద్ధికి నిధులు ఏదైనా తెచ్చవా..? మసీదు తవ్వితే శివ లింగాల గురించి పక్కన పెట్టు.. కాకతీయుల కాలం నుంచి ఉన్న శివాలాయాలకు నిధులు ఏమైనా ఇప్పించావా.? అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ను ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సంగారెడ్డి లో కల్పకుర్ గ్రామంలో వెయ్యేళ్ళ క్రితం శివాలయం ఉందని.. ఈ దేశాలయానికి కేంద్రం నుంచి నిధులు ఇప్పంచు అని డిమాండ్ చేశారు. తవ్వకాలు వదిలి, భూమి మీద ఉన్న శివాలయాల సంగతి చెప్పాలని అన్నారు.
బీజేపీ నేతలు భగవంతు డి భక్తులే అయితే.. దేవాలయాల వివరాలన్నీ తీసుకువచ్చి బీజేపీ ఆఫీస్ ముందు కూర్చుంటానని..మీ కిషన్ రెడ్డే మంత్రిగా ఉన్నాడు కదా..సంజయ్ నీకు చేతనైతే సంగారెడ్డిలోని పురాతన దేవాలయానికి రూ. 20 కోట్లు ఇప్పించాలని సవాల్ విసిరారు. బండి సంజయ్ మతాల మధ్య చిచ్చు పెడుతుంటే సీఎం కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బీజేపీకి భయపడుతన్నారా..? అని అన్నారు. బీజేపీతో కేసీఆర్ కు ఉన్న అవగాహనతోనే సైలెంట్ గా ఉన్నాారా..? అని ప్రశ్నించారు. మసీదు కూల్చాలని ఏ ధర్మములో ఉంది.. వాల్మీకి రామాయణంలో ఉందా..? రాముడు ఇదే చెప్పాడా..? అని అన్నారు.
తెలంగానలోకి అధికారంలోకి రావాలి అంటే మతాలను రెచ్చగొట్టడం లక్ష్యంగా పెట్టుకన్నారని బీజేపీ నేతలను విమర్శించారు. ప్రజలకు మేలు జరిగే పనులు ఏదైనా చేయండి అంటూ హితవు పలికారు. మోదీ హైదరాబాద్ కు వచ్చిన సమయంలో తెలంగాణకు స్పెషల్ ప్యాకజ్ ఇప్పటిస్తే బాగుండేదని జగ్గారెడ్డి అన్నారు. బండి సంజయ్ ఆ ప్రయత్నం కూడా చేయలేదని విమర్శించారు. ఎంతసేపూ మతాలను అడ్డుపెట్టుకుని బీజేపీ రాజకీయం చేస్తుందని విమర్శించారు జగ్గారెడ్డి.