ప్రధాని మోడీ.. తాజ్ మహల్ కింద డిగ్రీ పట్టాకోసం వెతుకుతున్నారని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఎద్దేవ చేశారు. భారత దేశానికి మొఘలులు వచ్చిన తర్వాతే బీజేపీ-ఆర్ఎస్ఎస్ వాళ్లు పుట్టుకొచ్చారని చురకలంటించారు. తాజ్‌మహల్ నిజానికి ఒక శివాలయమని, అందులో మూసి ఉన్న 22 గదుల్లో ఏముందో వెళికి తీయాలని బీజేపీకి చెందిన ఓ నాయకుడు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయాన్ని చరిత్రకారులకే వదిలేద్దామని.. అలహాబాద్ హైకోర్టు ఆ పిటిషన్‌ను…
ఎప్పుడు ఏదో ఓ రాజకీయ అంశంపై కీలక వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. మహారాష్ట్ర బివండీలో శనివారం ఓ సభలో ప్రసంగించారు. నిజానికి భారత దేశం ద్రవిడియన్లు, ఆదివాసీలది అని కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం నాది కాదు, మోదీ- షాలది కాదు, ఠాక్రేలది కాదని.. ద్రవిడియన్లు, ఆదివాసీలది మాత్రమే అని ఆయన అన్నారుు. మొగల్స్ తరువాతే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఉన్నాయని అసదుద్దీన్ అన్నారు. ఆఫ్రికా, మధ్య ఆసియా, ఇరాన్, తూర్పు ఆసియా…
రాబోయే కాలంలో తెలంగాణలో ఎగిరేది బీజేపీ జెండానే అని.. కాంగ్రెస్ దీపంలో ఢిల్లీలోనే ఆరిపోయిందని.. తెలంగాణలో వచ్చే అవకాశమే లేదని.. టీఆర్ఎస్ పార్టీని ఎవరూ నమ్మడం లేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. రాబోయే కాలంలో బీజేపీ ప్రళయం వస్తుందని అన్నారు. అద్వానీ రథయాత్ర చేసి ఆర్టికల్ 370 రద్దు చేయాలని, రామ మందిరం నిర్మించాలని యాత్ర చేశారని.. మోదీ నాయకత్వంలో ఈ రెండు సాధ్యమయ్యాయని అన్నారు. ట్రిపుల్ తలాక్ వ్యతిరేఖంగా బీజేపీ ప్రభుత్వం చట్టాన్ని…
ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీలో మూడు కుటుంబాల నుంచి గతంలో ఇద్దరు చొప్పున పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కేఈ కృష్ణమూర్తి కుటుంబంలో పత్తికొండ నుంచి కేఈ శ్యాంబాబు, డోన్ నుంచి కేఈ ప్రతాప్ పోటీ చేశారు. కోట్ల కుటుంబంలో కర్నూలు ఎంపీగా సూర్యప్రకాష్‌రెడ్డి, ఆలూరులో కోట్ల సుజాత బరిలో ఉన్నారు. భూమా ఫ్యామిలీ నుంచి ఆళ్లగడ్డలో అఖిలప్రియ, నంద్యాలలో బ్రహ్మానందరెడ్డి ఎన్నికల గోదాలోకి దిగారు. ఇప్పుడు ఈ కుటుంబాల నుంచి వచ్చే…
తెలుగు జాతి గర్వించదగ్గ మహా నటుడు పద్మశ్రీ నందమూరి తారకరామారావు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాలనే మలుపు తిప్పిన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా బీజేపీ తెలంగాణ శాఖ తరపున ఆయనకు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పౌరాణికం మొదలు జానపదం, జేమ్స్ బాండ్ సినిమాల వరకు అన్ని రకాల పాత్రలు పోషించి తెలుగు…
సీఎం కేసీఆర్ గతంలో కూడా ప్రళయం సృష్టిస్తా.. పీఎంను దేశం నుండి తరిమేస్తా.. బీజేపీ నీ బంగళా ఖాతంలో కలిపేస్తానంటూ వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓవైసీ నేను కలిసి దేశమంతా పర్యటిస్తా అన్నారు… ఫెడరల్ ఫ్రంట్ అన్నారు ముందు మీ పార్టీలో గుణాత్మక మార్పు రావాలి, కేసీఆర్ వ్యవహారంలో గుణాత్మక మార్పు రావాలి అంటూ కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీని విమర్శించే నైతిక హక్కు…
బెజవాడలో ఇటీవల మెగా అభిమానులు నిర్వహించిన సమావేశం ఇది. ఒకప్పుడు ఫ్యాన్స్ మీటింగ్ అంటే.. చిరంజీవి చేపట్టే సేవా కార్యక్రమాలు.. సినిమాల చుట్టూ చర్చ జరిగేది. విజయవాడ సమావేశం మాత్రం పూర్తిగా రాజకీయ అజెండా చుట్టూ తిరిగింది. జనసేనాని పవన్ కల్యాణ్ కేంద్రంగా జరిగిన ప్రసంగాలు.. ప్రస్తుతం పొలిటికల్ సర్కిళ్లలో చర్చగా మారాయి. పవన్ కల్యాణ్‌ను సీఎంగా చూడాలని.. అందుకోసం పనిచేయాలని మెగా అభిమానులు తేల్చేశారు. అయితే ఇది వాళ్లకు వాళ్లుగా చేసిన కామెంటా లేక ఎవరైనా…
ప్రధాని పర్యటన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు వస్తున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు నిలిపేయడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బేగంపేటకు రాకుండా పోలీసులు అడుగడుగున అడ్డుకున్నారంటూ మండి పడ్డారు. సీఎం డైరెక్షన్ లోనే సభకు రాకుండా పోలీసులు కుట్ర చేశారని ఆరోపించారు. అయినా టీఆర్ఎస్ కుట్రలను చేధించుకుని బేగంపేట సభకు బీజేపీ కార్యకర్తలు వచ్చారని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ ‘వినాశకాలే విపరీత బుద్ధి’గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బేగంపేట ఎయిర్ పోర్టుకు దగ్గరగా ఉన్న…