తెలంగాణపై బీజేపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టిందా? రాబోయే రోజుల్లో కమలదళం దూకుడు పెంచుతుందా? అంటే అవుననే అనిపిస్తోంది.2023 ఎన్నికలకు బీజేపీ ఇప్పటినుంచే స్కెచ్చేస్తోంది. మరో వైపు బీజేపీ జాతీయ సమావేశాలకు హైదరాబాద్ వేదిక కానుంది. ఆ పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జూలైలో జరగబోతున్నాయి.
దీనికి సబంధించి కమలదళం ఇప్పటినుంచి ఏర్పాట్లు మొదలుపెట్టింది. తెలంగాణపై బిజెపి కేంద్ర నాయకత్వం సీరియస్‌గా ఫోకస్ చేసింది. ఎలాగైనా కాషాయ జెండా ను ఎగిరే యాలని వ్యూహ రచన చేస్తున్నారు.. తరచూ నేతలు రాష్ట్ర పర్యటనలకు వస్తున్నారు. తెలంగాణ లో పార్టీ సంస్థాగత అంశాలపై సమీక్ష చేస్తున్నారు. ఓవైపు భరోసా ఇస్తూనే… కొత్తవారిని పార్టీలోకి తీసుకురావాలని సూచిస్తున్నారు. మే నెలలోనే మోడీ సహా ముగ్గురు ముఖ్య నేతలు రాష్ట్రానికి వచ్చారు.
మరోవైపు బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు కూడా హైదరాబాద్‌లోనే పెట్టాలని దాదాపు నిర్ణయించింది హైకమాండ్. రాష్ట్ర బిజెపికి సంకేతాలు కూడా ఇచ్చింది. దీంతో సమావేశాల వేదిక పై ఇక్కడి నేతలు చర్చిస్తున్నారు. హైటెక్స్ తో పాటు శంషాబాద్ విమానాశ్రయానికి దగ్గర్లో ప్రాంతాలను పరిశీలిస్తున్నారు.
ప్రధానితో పాటు బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశాలకు హాజరు అవుతారు. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేయాలి కాబట్టి.. ఇప్పటినుంచే కసరత్తు మొదలైంది. ఈ సమావేశాలు రెండు రోజుల పాటు జరుగుతాయి. జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో జరిగితే బిజెపి కి ప్లస్ అవుతుందని నేతలు భావిస్తున్నారు. దీనిపై వారం పది రోజుల్లో పూర్తి క్లారిటీ రాసుంది. మరో విడత ప్రజాసంగ్రామ యాత్రకు రెడీ అవుతున్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. రెండు మార్లు చేసిన యాత్ర సక్సెస్ కావడంతో మరోసారి జనంలోకి వెళ్ళి టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని భావిస్తున్నారు. మూడోసారి యాత్రపై కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టాలని, పార్టీలోకి చేరేవారిని వెంటనే చేర్చుకోవాలని ఇటీవల జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచించారు.
Srinidhi Shetty: ‘నాకు డబ్బే ముఖ్యం’ అంటూ బాంబ్ పేల్చేసిందిగా