ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పొత్తులపై అప్పుడు పెద్ద చర్చ సాగుతోంది.. అయితే, ఇప్పటికే పలు సందర్భాల్లో పొత్తులపై మాట్లాడిన బీజేపీ ఏపీ ఇంఛార్జ్ సునీల్ దియోధర్.. మరోసారి క్లారిటీ ఇచ్చారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందనే విషయంపై పలు రకాల వార్తలు వస్తున్నాయి.. టీడీపీ, వైసీపీలకు బీజేపీ దూరంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇక, జనసేన పార్టీతో మాత్రమే పొత్తు ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఈ విషయాన్ని కార్యకర్తలకు స్పష్టం…
ప్రధాని మోడీ హైదరాబాద్‌లో నేడు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బేగంపేట ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్లో హెచ్సీయూకు ప్రధాని మోడీ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా బీజేపీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. అయితే బేగంపేట ఎయిర్ పోర్టులో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని తెలుగులో… పట్టుదలకు, పౌరుషానికి మారుపేరైన తెలంగాణ ప్రజలకు నమస్కారం అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. పట్టుదలకు, పౌరుషానికి తెలంగాణ ప్రజల పేరుందని, తెలంగాణ…
తిరుమలలో స్వామి వారికి నిత్యం జరిగే కార్యక్రమాలను నిలిపేశారు.. దీంతో, హిందూ మనోభావాలను కించ పరుస్తున్నారు.. వేంకటేశ్వర స్వామి భక్తుల హృదయాలు గాయపడుతున్నాయని మండిపడ్డారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. నెల్లూరులో బీజేపీ రాష్ట్ర కార్యవర్గా సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో హిందువులపై దాడులు పెరిగిపోయాయన్నారు. కర్నూల్ జిల్లా ఆత్మకూరు, శ్రీశైలంలో, కాకినాడ జేఎన్టీయూలో, ఎమ్మెల్యే ద్వారంపూడి సహకారంతో మసీదు నిర్మాణం లాంటి పరిణామాలు చూస్తే ప్రభుత్వ తీరు అర్థం అవుతుందన్నారు.…
కరోనా కల్లోలమో, ఉక్రెయిన్ యుద్ధ ప్రభావమో, రెండూ కలిసి దరువేశాయోగానీ, ధరల మోత సామాన్యుల బతుకులను బండకేసి బాదింది, బాదుతోంది. ద్రవ్యోల్బణం రికార్డుస్థాయిలో పైపైకి ఎగబాకుతోంది. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదంటూ కామన్ మ్యాన్ కష్టాల రాగం ఆలపిస్తున్నాడు. ఇలా రేట్లు రాకెట్ వేగంతో దూసుకుపోతున్న టైంలో, కేంద్ర ప్రభుత్వం చెప్పుకోదగ్గ రిలీఫ్ ఇచ్చింది. పేస్ట్ నుంచి పడుకునే బెడ్ వరకు అన్ని ధరలు ప్రభావితమయ్యే పెట్రో రేట్లను కూసింతో, కాసింతో తగ్గించింది. లీటర్…
ఆపరేషన్ ఆకర్ష్. తెలంగాణలో బీజేపీ ఎప్పుడో చేపట్టింది. ఇతర పార్టీల నేతలకు వలలు.. గేలాలు ఎన్నో వేస్తోంది. నాలుగు గోడల మధ్య జరుగుతున్న చర్చలు అనేకం. అదిగో వచ్చేస్తున్నారు.. ఇదిగో వచ్చేస్తున్నారు అనే హడావిడి తప్పితే బీజేపీ గడప ఎక్కినవాళ్లు తక్కువే. ఇతర పార్టీలలో పెద్ద నేతలుగా చెలామణి అవుతున్న వాళ్లు బీజేపీతో టచ్‌లో ఉన్నారని.. కాషాయ కండువా కప్పుకోవడమే మిగిలిందని అనేక లీకులు ఇచ్చారు. ఇదే సమయంలో రాష్ట్రానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా..…
కోనసీమ జిల్లాకి అ౦బేద్కర్ పేరు పెట్టడానికి అన్ని పార్టీలు అ౦గీకరి౦చాయని ప్రభుత్వం మాకు ఏమైనా లేఖ ఇచ్చి౦దా..? అని ప్రశ్నించారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అమలాపురంలో ప్రభుత్వం ఓ చర్చకి తెరలేపి౦ది.. ప్రభుత్వానికి మారణ హోమం జరగడం కావాలని ఆరోపించారు. అమలాపురంలో వాళ్లే అంతా చేశారన్నా ఆశ్చర్య పోనక్కరలేదన్న ఆయన.. గతంలో ఇలాంటి ఘటనలు హైదరాబాద్‌లో చేశారని మండిపడ్డారు.. కోనసీమలో జరిగిన ఘటనకు ప్రభుత్వ వైఫల్యంగా పేర్కొన్న బీజేపీ…
ప్రధాని మోడీ రేపు హైదాబాద్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఇండియన్ స్కూల్ ఆప్ బిజినెస్ (ఐఎస్బీ) 20 సంవత్సరాల స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. అయితే ఇప్పటికే.. తెలంగాణ బీజేపీ నేతలు ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. పోలీసులు కూడా గచ్చిబౌలి ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అంతేకాకుండా భద్రత కారణాల దృష్ట్యా ఎస్పీజీ ఆధీనంలోకి ఐఎస్బీ వెళ్లిపోయింది. అయితే తాజాగా ప్రధాని మోడీకి పర్యటనకు సంబంధించిన…
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడే ఎన్నికలు వచ్చే అవకాశం లేకపోయినా.. గత కొంతకాలంగా ఎన్నికలకు సంబంధించిన పొత్తులపై మాత్రం ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా అంతా ఏకం కావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే కాగా.. టీడీపీ నేతలు కూడా పొత్తులకు సై అనే విధంగా సంకేతాలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో జనసేన పార్టీ-బీజేపీ మధ్య మైత్రి ఉండగా.. ఎన్నికలలోపు ఏదైనా జరగొచ్చు అనే చర్చ సాగుతోంది.. ఈ నేపథ్యంలో.. పొత్తులపై…
బీజేపీ నాయకురాలు విజయశాంతి కేసీఆర్ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణకు రిజర్వ్ బ్యాంక్ దగ్గర అప్పు పుట్టే పరిస్థితి లేదని.. అయినా గొప్పలు చెప్పుకుంటున్నారంటూ ట్విట్టర్ వేదికగా ట్విట్టర్విల్లులో విమర్శనాస్త్రాలు సంధించారు. ”ధనిక రాష్ట్రం.. ఒక్కో ఎకరం కోట్లు.. అందులో నంబర్ వన్.. ఇందులో ఆదర్శం.. ఇవన్నీ వినడానికి బానే ఉంటాయి కానీ, ఆచరణలో కూడా ఉంటే బాగుంటుంది. తెలంగాణ ఏర్పడే నాటికి ధనిక రాష్ట్రాన్ని కాస్తా ఇప్పుడు అప్పుల కుప్పగా కేసీఆర్ మార్చేశారు. అప్పు…