రాజ్యసభ అభ్యర్ధుల ఎంపిపై కసరత్తు చేస్తున్న బీజేపీ నలుగురు అభ్యర్ధులతో రెండో జాబితా విడుదల చేసింది. తెలంగాణనుంచి బీజేపీ సీనియర్ నాయకులు లక్ష్మణ్‌కు రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని ఖారారు చేశారు. ఆయనకు ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించింది. యూపీనుంచి మిథిలేశ్ కుమార్ లక్ష్మణ్, డాక్టర్ లక్ష్మణ్, కర్ణాటకనుంచి లహర్ సింగ్ సిరోయ, మధ్యప్రదేశ్ నుంచి సుమిత్ర వాల్మికి అభ్యర్థిత్వాన్ని బీజేపీ కేంద్ర కార్యాలయం ఖరారు చేసింది.
తెలంగాణకు నుంచి రాజ్యసభకు ఎంపిక అయిన డాక్టర్ కే.లక్మణ్ ను ఉత్తరప్రదేశ్ నుంచి అభ్యర్ధిగా ప్రకటించారు. లక్ష్మణ్ ప్రస్తుతం బీజేపీ ఓబీసి జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గతంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా, ముషీరాబాద్ ఎమ్మెల్యేగా పని చేశారు. ఆయన ఇవాళ లక్నో వెళ్లి నామినేషన్ దాఖలు చేయనున్నారు. మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులు ఉదయం 11 గంటలకు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. 15 రాష్ట్రాలకు చెందిన 57 రాజ్యసభ స్థానాలకు జూన్ 10న పోలింగ్ జరగనున్నది.
ఇప్పటికే తొలి జాబితాలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ పేర్లను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. కర్నాటక నుంచి నిర్మలా సీతారామన్, మహారాష్ట్ర నుంచి పీయూష్ గోయల్ మరోసారి పోటీ చేయనున్నారు.
యూపీ నుంచి 11 రాజ్యసభ సీట్లు ఖాళీగా ఉన్నాయి. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మీకాంత్ వాజ్పేయి బహిష్కరణకు తెరపడింది. 2014 లోక్సభ ఎన్నికల్లో వాజ్పేయి కీలక పాత్ర పోషించారు. సంస్థకు నాయకత్వం వహించారు తర్వాత 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ సంస్థ ఆయనను జాయినింగ్ కమిటీకి చైర్మన్ గా చేసింది. ఇది కాకుండా, లక్ష్మీకాంత్ వాజ్పేయి ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున ఇతర పార్టీల నాయకులను బీజేపీలో చేర్చుకున్నారు. యూపీలో బీజేపీ ఎనిమిది సీట్లు గెలుచుకోవడం ఖాయమని భావిస్తున్నారు.
भारतीय जनता पार्टी की केंद्रीय चुनाव समिति ने विभिन्न राज्यों में होने वाले आगामी राज्य सभा द्विवार्षिक चुनाव 2022 के लिए निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की है। सभी प्रत्याशियों को बधाई एवं शुभकामनाएं। pic.twitter.com/jlP7DO146G
— BJP Uttar Pradesh (@BJP4UP) May 30, 2022