కేంద్ర ప్రభుత్వం గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుందని టీపీసీసీ అద్యక్షులు రేవంత్ రెడ్డి విమర్శించారు. గాంధీ భవన్ లో టీపీసీసీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గాంధీ కుటుంబానికి కష్టం వస్తే మనందరికీ కష్టం వచ్చినట్టే అని, ప్రతి కార్యకర్త దీనిపై స్పందించాలని అన్నారు. రాహుల్ గాంధీ సోమవారం నాడు (13)న ఈ.డి కార్యాలయానికి వెళ్లి బయటకు వచ్చేంతవరకు ఈ.డి కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేయాలని అన్నారు. 15వ తేదీన అల్ పార్టీ…
నన్ను ఆపే శక్తి ఎవరికీ లేదు.. ఇదీ గవర్నర్ తమిళిసై మాట.. మహిళా దర్బార్ నిర్వహించిన గవర్నర్, తెలంగాణ సర్కారుకు…రాజ్ భవన్ కు మధ్య పోరుని కొత్త మలుపు తిప్పారు. ఒక సోదరిలా తెలంగాణ మహిళలకు అండగా ఉంటానని చెప్పిన గవర్నర్, గ్యాంగ్ రేప్ ఘటనపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించినా ఇంతవరకు పట్టించుకోలేదన్నారు. మహిళా దర్బార్ పై రాజకీయ వర్గాల్లో భిన్న స్పందనలు వ్యక్తమౌతున్నాయి. తెలంగాణ గవర్నర్ వర్సెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం మధ్య వార్…
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా పాదయాత్రలో భాగంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కెసిఆర్, ప్రధాన మంత్రి నరేంద్రమోడీ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజల కోసం పని చేయకుండా…
శుక్రవారం నాలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మహారాష్ట్రలో ఓటింగ్కు అర్హత సాధించిన మొత్తం 285 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహారాష్ట్రలో ఆరు స్థానాలకు ఎన్నికలు జరగగా.. బీజేపీ ముగ్గురు అభ్యర్థులను నిలబెట్టగా, శివసేన ఇద్దరు, కాంగ్రెస్, ఎన్సీపీ ఒక్కొక్కరు చొప్పున అభ్యర్థులను నిలబెట్టడంతో పోటీ అనివార్యమైంది. మొత్తం ఆరు స్థానాలకు గానూ ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. బీజేపీ నుంచి పీయూష్ గోయల్, అనిల్ బోండే, ధనంజయ్ మహాదిక్ గెలుపొందారు.…
ఓ టీవీ డిబెట్ లో పాల్గొంటూ బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై దేశంలో, విదేశాల్లో దుమారమే చెలరేగుతోంది. ఇప్పటికే ఖతార్, యూఏఈ, సౌదీ, మలేషియా, ఇరాక్ వంటి దేశాలు భారత్ కు తమ నిరసన తెలిపాయి. భారత విదేశాంగ శాఖ కూడా అంతే స్థాయిలో బదులిచ్చింది. ఇప్పటికే మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మతో పాటు నవీన్ జిందాల్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిందని.. వ్యక్తులు చేసిన…
తెలంగాణ పాలిటిక్స్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం జరుగుతోంది. అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ తో పాటు మంత్రులు, లోక్ సభ, రాజ్యసభ, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్లు, విప్ లతో కీలక సమావేశం జరుగుతోంది. ముఖ్యంగా కేంద్రం అనుసరిస్తున్న తీరుతో పాటు రాష్ట్రపతి ఎన్నికల గురించి ప్రధాన చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై ప్రధానంగా చర్చ సాగుతోంది. ఇటీవల కాలంలో బీజేపీకి…
ప్రజల ప్రాణాలు, మానాలు, ఆస్తులు రక్షించలేని కేసీఆర్కి ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదు అని ఫైర్ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న లైంగిక వేధింపుల ఘటనలపై స్పందించిన ఈటల.. ఆర్.కె.పురం డివిజన్లోని ఎన్టీఆర్ నగర్లో తొమ్మిదేళ్ల అమ్మాయిపై లైంగిక దాడులు జరిగాయి. స్థానిక కార్పొరేటర్ రాధ ధీరజ్ రెడ్డి, నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీరాములు, స్థానిక నాయకులు అందరూ బస్తీని సందర్శించి ప్రజలకు భరోసా ఇచ్చి.. కుటుంబాన్ని…
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీ ఆర్ నగర్ లో అత్యాచారానికి గురైన బాలిక కుటుంబ సభ్యులను వనస్థలిపురం లోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో స్థానిక బిజెపి నాయకులతో కలిసి బిజెపి నాయకులు ఈటెల రాజేందర్ పరామర్శించారు. తెలంగాణ లో ఎన్ని లక్షల సీసీ కెమెరాలు,షీటీమ్స్ ఎన్ని ఉన్నా కానీ మహిళలపై ఎందుకు అత్యాచారాలు జరుగుతున్నాయని ప్రశ్నించారు. కేవలం ప్రగల్భాలు పలికే అసమర్థత సీఎం వెంటనే రాజీనామా చేయాలి డిమాండ్ చేశారు. మహిళలపై జరుగుతున్న హత్యచార కేసులను…
దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పనలో ప్రధాని విఫలమయ్యారని టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ట్వీట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. ‘ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ 2014 ఎన్నికలకు ముందు ఎంతో గంభీరంగా మీరు మాట్లాడినదంతా ఢాంభికమే అనేందుకు ఎనిమిదేళ్ల మీ పాలనే నిదర్శనంగా కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అసమర్థ నిర్ణయాలు, అర్థిక విధానాలతో కొత్త ఉద్యోగాలు రాలేదు సరికదా.. ఉన్న ఉపాధి అవకాశాలకు గండి కొట్టారని మండిపడ్డారు. మీరు తీసుకున్న నోట్ల…