తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టింది. మొన్న మోడీ.. నిన్న అమిత్ షా.. నేడు తరుణ్‌చుగ్ రానుండటంతో.. తెలంగాణ రాష్ట్రంపై దృష్టి పెట్టిందనే చెప్పాలి. ప్రధాని నరేంద్ర మోదీ May 26న హైదరాబాద్ లో రెండున్నర గంటల పాటు రాష్ట్ర రాజధానిలో పర్యటించిన విషయం తెలిసిందే.. నగరంలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) 20వ వార్షికోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. కాగా.. JUNE 02న అమిత్ రాష్ట్రంలో పర్యటించారు. తెలంగాణ బీజేపీ అద్యక్షుడు బండి సంజయ్ నిర్వహించిన…
బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల దుమారం చెలరేగుతూనే ఉంది. గత వారం నుంచి దేశంలోని పలు ప్రాంతాల్లో ముస్లింలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ వివాదంపై ఇస్లామిక్ ప్రపంచం భారత్ కు తమ నిరసననను తెలియజేశాయి. ఖతార్, మలేషియా, ఇరాక్, యూఏఈ, సౌదీ ఇలా చాలా దేశాలు భారత రాయబారులకు నిరసన తెలిపాయి. దీనికి బదులుగా ఇండియాకు కూడా వివరణ ఇచ్చింది. వ్యక్తి గత వ్యాఖ్యలను ప్రభుత్వానికి…
మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ జాతీయ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతూనే ఉన్నాయి.. ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్ల నుంచి నుపుర్‌కు నోటీసులు వెళ్తున్నాయి.. తాజాగా, కోల్‌కతా పోలీసులు షాక్ ఇచ్చారు. నార్కెల్‌దంగా పోలీస్ స్టేషన్లో ఐపీసీ 153ఏ, 295ఏ, 298 మరియు 34 సెక్షన్ల కింద నుపుర్ శర్మపై కేసు నమోదు చేశారు కోల్‌కతా పోలీసులు.. ఇక, 41ఏ CrPC కింద జూన్ 20వ తేదీన తమ ముందు…
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లి గ్రామంలోని గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ పేరుతో అర్దరాత్రి పోలీసులు పేదల పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. చిన్నా పెద్దా, మహిళలనే తేడా లేకుండా దౌర్జన్యం చేసి కాళ్లు చేతులు విరగ్గొట్టడం, తలలు పగలకొట్టడం దారుణమన్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా నిర్వాసితులను ఆదుకోకుండా ఏళ్ల తరబడి సమస్యను నాన్చుతూ కాలయాపన చేయడం అన్యాయమని అన్నారు. ఉన్నట్లుండి…
తెలంగాణ BJP అనుబంధ విభాగాలు ఉన్నాయి. ఈ అనుబంధ మోర్చా లన్నింటికి కమిటీలు కూడా ఉన్నాయి. యువజన మోర్చ, మహిళా, కిసాన్, దళిత, గిరిజన, OBC, మైనార్టీ మోర్చా లు BJPకి ప్రధాన అనుబంధ విభాగాలు. అయితే… ఇందులో కొన్ని మోర్చాలు తమ పరిధిలో జరుగుతున్న వ్యవహారాన్ని అస్సలు పట్టించుకోవడం లేదట. పార్టీ చెప్పేంత వరకు కనీసం స్పందించడం లేదట. తాము ఉన్నామని చెప్పుకునేందుకు ఏదో పార్టీ ఇచ్చిన ప్రోగ్రాంలు అప్పడప్పుడు చేస్తున్నారని లోకల్ టాక్. ప్రధానంగా…
బీజేపీ నేత నుపుర్ శర్మ.. మహమ్మద్ ప్రవక్తపై చేసిన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి… ఓవైపు ముస్లిం దేశాల నుంచి భారత్‌పై తీవ్ర వ్యతిరేకత.. మరోవైపు ఉగ్రవాద సంస్థల నుంచి బెదిరింపులు.. మహమ్మద్ ప్రవక్తను కించపరిచేలా నుపుర్ శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశానికే ముప్పు తలపెట్టేలా మారగా.. అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ నుపుర్ శర్మ అనుచిత వ్యాఖ్యలకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించిన విషయం తెలిసిందే.. తాజాగా, భారత్‌పై సైబర్ ఎటాక్స్ మొదలయ్యాయి.. దీనికి…
బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ పై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఊరు మన బడికి కేంద్రం నిధులు ఇచ్చిందని బీజేపీ నేతలు చెబుతున్నారని, కార్యక్రమానికి రూ. 2700కోట్లు ఎక్కడ ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన పైసలు ఎక్కడ విడ్‌త్రా చేసుకోవాలో బండి సంజయ్ చెప్పాలని సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. ఒక పక్క టెట్ వాయిదా వేయాలంటూనే మరో 20వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలంటున్నారని, బండి సంజయ్ బాధ్యతగా…
బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దేశంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. అరబ్ సమాజం కూడా ఈ వ్యాఖ్యలపై భారత్ కు తమ నిరసన తెలిపాయి. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మను శిక్షించాలని అంటూ శుక్రవారం ప్రార్థనల తర్వాత పలు ప్రాంతాల్లో నిరసలు, ఆందోళనలు చెలరేగాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో నిరసలు హింసాత్మకంగా మారాయి. పశ్చిమ బెంగాల్ హౌరాలో, జార్ఖండ్ రాంచీలో, యూపీ ప్రయాగలో హింసాత్మక ఘటనలు…
బీజేపీ నేత డీకే అరుణ సంచలన కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు సిద్ధం అవుతోందని ఆమె అన్నారు. ప్రజలకు ఇచ్చిన హమీలను కేసీఆర్ తుంగలో తొక్కి మరోసారి ఎన్నికల్లో ప్రజలను మోసగించేందికు సిద్దమవుతున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో బలపడుతున్న బీజేపీని అడ్డుకునేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా,సంక్షేమ పథకాలను ప్రజలకు కార్యకర్తలు విధిగా తెలియజేయాలని సూచించారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణలో అమలు చేయకపోవడంతో పేదలు వైద్యం కోసం ఇబ్బంది పడుతున్నారని…