దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఇదే విషయాన్ని మోదీ, అమిత్ షాలకు స్పష్టంగా చెప్పానని కేఏ పాల్ అన్నారు. ఎకనామిక్ సమ్మిట్ పెట్టాలని కోరాని.. ఈ వారంలో డేట్ ఫిక్స్ చేస్తామని చెప్పారని ఆయన అన్నారు. మోడీ, అమిత్ షాలు అహ్మదాబాద్ లో సమ్మిట్ ఫెట్టమని అడుగుతున్నారని.. అయితే నేను హైదరాబాద్ లో అయితేనే సమ్మిట్ పెడతా.. అని చెప్పానన్నారు. మీరు అన్నీ అహ్మదాబాద్ తీసుకెళ్తున్నారని.. ఈ విషయంలో నేను కాంప్రమైజ్ అవ్వనని కేఏ పాల్ అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో నన్ను సహకరించమని కోరుతున్నారని అన్నారు.
దేశ రాష్ట్రపతి ఎన్నికల్లో నన్ను సహకరించమని కోరారని.. మాకు ఎమ్మెల్యేలు, ఎంపీలు లేరని..దాదాపుగా 18 పార్టీలు సేవ్ సెక్యులర్ ఇండియా కూటమి ఉన్నాయని ఆయన అన్నారు. మమతా బెనర్జీ థర్డ్ ఫ్రంట్ లీడ్ చేయడానికి కృషి చేస్తున్నారని అన్నారు. అయితే ఈ ఫ్రంట్లు, నాలుగు ఫ్రంట్లుగా తయారయ్యాయని.. ప్రతిపక్షాలు యూనిటీగా లేకపోవడం బాధగా ఉందని ఆయన అన్నారు. ఈ నెల 21 లోపు రాష్ట్రపతి అభ్యర్థిని తేల్చేందుకు చర్చిస్తున్నామని అన్నారు. బీజేపీ నాయకులు నన్ను ఈశాన్య రాష్ట్రాల్లో పోటీ చేయమని కోరుతున్నారని.. బీజేపీ తరుపున పోటీ చేసే వ్యక్తే రాష్ట్రపతి అవుతారని ఆయన అన్నారు.
కేసీఆర్ గురించి చర్చించామని.. ఆయనకు 9 ఎంపీలు ఉన్నారని.. వచ్చే ఎన్నికల్లో ఒక్కసీటు గెలవరని సర్వేలు చూపించానని అన్నారు. ప్రశాంత్ కిషోర్ వివిధ ప్రయత్నాలు చేసినా ఫలితం లేదని అన్నారు. కేసీఆర్, దేశ నేతలను కలవడాన్ని ఖండించానని.. కేజ్రీవాల్ కు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చానని, దేవెగౌడతో మాట్లాడానని కేఏ పాల్ అన్నారు. తెలంగాణను అప్పులమయంగా చేశారని కేసీఆర్ ను విమర్శించారు. కేసీఆర్ తెలంగాణలో తిరస్కరించబడ్డారని ఆయన అన్నారు. శ్రీకాంత్ చారి తండ్రికి , కుటుంబానికి ఒక ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే స్థానం ఇవ్వలేదని ఆయన విమర్శించారు. 8 ఏళ్లుగా మీరు ఫెయిల్ అయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి క్రెడిబిలిటీ పోయిందని.. 44 స్థానాలు ఉన్న ఎంపీ స్థానాలు 14కు చేరుతాయని అన్నారు.