మోడీ తూటాలకు తెలంగాణ బిడ్డ బలయ్యారని ప్రభుత్వ విప్ బాల్కసుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ విధానాలకు వరంగల్ బిడ్డ రాకేష్ బలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ఫాసిస్ట్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని మండి పడ్డారు. బీజేపీ కి ఇక శంకర గిరి మాన్యాలే అంటూ విమర్శించారు. మా తెలంగాణ బిడ్డల రక్తం కళ్ళ జూసిన వారెవ్వరూ బాగు పడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కి పుట్టగతులు లేకుండా చేస్తామని నిప్పులు చెరిగారు.
కాశ్మీర్ నుంచి కన్య కుమారి దాకా ప్రజలు బీజేపీ పై తిరుగు బాటు చేయాలని పిలుపునిచ్చారు. మోడీ తూటాలకు బలైన రాకేష్ కుటుంబానికి టీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. యువతతో పెట్టుకున్న వాడు ఎవడూ బాగు పడలేదని మండిపడ్డారు. ఆర్మీ నియామక ప్రక్రియ ను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఉద్యోగాల భర్తీ జరిపినట్టే కేంద్రంలో జరగాలని అన్నారు. సికింద్రాబాద్ ఆందోళనల్లో పార్టీ లకు సంబంధం లేదని అందులో పాల్గొన్న వారే చెప్పారని గుర్తు చేశారు. ఆర్మీలో పెన్షన్ భారాన్ని వదిలించుకునేందుకు కేంద్రం అగ్ని పథ్ తెచ్చిందని అన్నారు. ఆర్మని కూడా మోడీ వ్యాపార సంస్థ గా మారుస్తున్నారని మండిపడ్డారు.
అగ్ని పథ్ పై దేశ వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలకు పూర్తి భాద్యత మోడీ సర్కార్ దే.. మరెవ్వరిది కాదని మండిపడ్డారు. ఆర్మీలో చేరడాన్ని దైవ కార్యంగా యువత భావిస్తుందని కొనియాడారు. ఇలాంటి స్కీం ను కూడా మిగతా మూర్ఖపు స్కీం లాగా మోడీ తెచ్చి యువత ఆగ్రహానికి కారణమయ్యారని మండిపడ్డారు. యువత ను విస్మరించడం భాధ్యతారహిత్యం అని సుమన్ పేర్కొన్నారు. ఇప్పటికైనా మోడీ ఈ పథకాన్ని పునః సమీక్షించాలని డిమాండ్ చేశారు. మోడీ అనాలోచిత చర్యలతో అన్ని వర్గాలు రోడ్లపైకి వస్తున్నాయని నిప్పులు చెరిగారు.
Vijayasai Reddy: టీడీపీకి సాయిరెడ్డి కొత్త అర్థం.. తెలుగు దున్నపోతుల పార్టీ..!