సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో రేణుక ఎల్లమ్మ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. డబల్ బెడ్ రూమ్ ఇళ్లల్లో వెనుక పడ్డామని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామన్నారు. అగ్నిపథ్ అంటే మిలిటరీ ఉద్యోగం నాలుగేళ్లు చేయాలంట అంటూ ఆయన మండిపడ్డారు. యువతను బీజేపీని మోసం చేస్తుందని, ఓ కేంద్ర మంత్రి అంటారు కటింగ్ చేయడం నేర్పిస్తా… బట్టలు ఇస్త్రీ చేయడం నేర్పిస్తా అంటారు.. ఆర్మీని కూడా ప్రైవేట్ చేస్తారా అంటూ హరీష్‌రావు అగ్రహం వ్యక్తం చేశారు.
ఎనిమిదేళ్ల బీజేపీ పాలనలో ఒక్కటైన మంచి పని చేసిందా అని ఆయన ప్రశ్నించారు. రైతుల ఉసురు పోసుకుందని, బీజేపీ రైతులను చంపిందంటూ ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. సిలిండర్ ధర 400 నుంచి 1000కి పెంచిందని, రూపాయి విలువ దిగజార్చారని ఆయన ధ్వజమెత్తారు. సిపాయిలు అంటే ఎంతో గౌరవం ఉండేది… కానీ బీజేపీ సిపాయిలకు కూడా విలువ తగ్గించి కాంట్రాక్టు ఉద్యోగం అంటారని, గాంధీని చంపిన గాడ్సేను కూడా వీరుడు అంటారని ఆయన విమర్శించారు.
గాంధీని కించపర్చిన వాళ్ళు బీజేపీలోనే ఉన్నారని, నల్ల ధనం తెస్తాం.. పేదలకు 15 లక్షలు పంచుతాం అన్నారు ఏమైందన్నారు. పెద్ద నోట్ల రద్దు అన్నారు 1000 పోయి రెండు వేల నోటు వచ్చిందని, జన్ ధన్ అకౌంట్ లు అన్నారు, అంత ఉత్త మోసమంటూ ఆయన మండిపడ్డారు. జీఎస్టీతో వ్యాపారుల ఉసురు పోసుకున్నారన్న హరీష్‌రావు.. యువత ఉసురు పోసుకుంటున్నారన్నారు. యువతను చంపిర్రు.. బాయిల కాడా మోటార్లు పెడితే ఏడాదికి 5000 కోట్లు ఇస్తామన్నారు.. వడ్లు కొనమంటే కొంటలేరంటూ ఆయన కేంద్రంపై నిప్పులు చెరిగారు.