ఆయన పాన్ షాపు సంజయ్..! ఈయన కుర్కురే రెడ్డి.. ! అంటూ.. బండి సంజయ్ , కిషన్ రెడ్డిపై ప్రభుత్వ విప్ బాల్కసుమన్ సెటైర్లు విసిరారు. అగ్ని పథ్ పై దేశ వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలకు పూర్తి భాద్యత మోడీ సర్కార్ దే.. మరెవ్వరిది కాదని మండిపడ్డారు. ఆర్మీలో చేరడాన్ని దైవ కార్యంగా యువత భావిస్తుందని కొనియాడారు. ఇలాంటి స్కీం ను కూడా మిగతా మూర్ఖపు స్కీం లాగా మోడీ తెచ్చి యువత ఆగ్రహానికి కారణమయ్యారని మండిపడ్డారు. యువత ను విస్మరించడం భాధ్యతారహిత్యం అని సుమన్ పేర్కొన్నారు. ఇప్పటికైనా మోడీ ఈ పథకాన్ని పునః సమీక్షించాలని డిమాండ్ చేశారు. మోడీ అనాలోచిత చర్యలతో అన్ని వర్గాలు రోడ్లపైకి వస్తున్నాయని నిప్పులు చెరిగారు.
నోట్ల రద్దు, వ్యవసాయ చట్టాలు, CAA, GST, SC, ST అత్యాచార చట్టానికి సవరణ..తాజా గా అగ్నిపథ్ ఇలా మోడీ ప్రతి నిర్ణయానికి ఎదో ఒక వర్గం రోడ్లపైకి వచ్చిందని విమర్శించారు. మోడీ ఆదానీ సేవలో తరిస్తున్నారని మండిపడ్డారు. మోడీ తుగ్లక్ విధానాలపై దేశం గళమెత్తాల్సిన సమయం ఆసన్నమైందని సుమన్ అన్నారు. మోడీ ఫాసిస్ట్ విధానాలపై టీ ఆర్ ఎస్ ఎవరు కలిసి వచ్చినా కలిసి రాకున్నా పోరాటం ఆపదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాతో కలిసి వచ్చే సంఘాలు సంస్థలు దేశ వ్యాప్తంగా ఉన్నాయని పేర్కొన్నారు. దేశం లో పన్నెండుకు పైగా రాష్ట్రాల్లో హింసాత్మక సంఘటనలు జరిగాయని గుర్తు చేశారు.
తెలంగాణలో హింసకు టీఆర్ఎస్ భాద్యత వహించాలని బండి, కిషన్ రెడ్డి అనడం దుర్మార్గమని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో హింస కు అక్కడి బీజేపీ యే కారణమా వాళ్ళు చెప్పాలని ఆగ్రహం వ్యక్తంచేశారు. యువతలో పెల్లుబుకుతున్న ఆవేశమే ఇలాంటి ఘటనలకు కారణమని అన్నారు. తెలంగాణ లో ఉద్యోగాల భర్తీ జరిపినట్టే కేంద్రం లో జరగాలని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి తలా తోక లేని మాటలు మాట్లాడితే స్పందించాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా బాల్క సుమన్ అన్నారు.
Somu Veerraju: అగ్నిపథ్ సాకు మాత్రమే.. ధ్వంసం వారి లక్ష్యం…!