టీఆర్ఎస్ పార్టీ నేతలు బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. కేంద్రం ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎండగడుతున్నారు. ఇటీవల 10 లక్షల ఉద్యోగాలపై టీఆర్ఎస్ విమర్శలు గుప్పించింది. ఇది ఎన్నికల స్టంట్ గా అభివర్ణించింది. దీనిపై ప్రధాని మోదీని విమర్శిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే 10 లక్షల ఉద్యోగాలను స్వాగతిస్తున్నాం అంటూనే గతంలో బీజేపీ పార్టీ ఇచ్చిన హామీలను విస్మరించిందని.. ప్రస్తుతం ఉద్యోగాల భర్తీని నమ్మలేమని వ్యాఖ్యానించారు. దీంతో పాటు దేశంలో ఆర్థిక పరిస్థితి, ద్రవ్యోల్భనం,…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మరోసారి సెటైర్లు వేశారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. అభివృద్ధి కార్యక్రామాలు, ఓట్లకు లింకు పెట్టిన ఆయన.. అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఓట్లు రావని.. వాటిని లైట్‌గా తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి కాల్వల్లో పూడిక కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు.. పంట కాల్వల, డ్రెయిన్ల నిర్వహణ ఒక నిరంతర ప్రక్రియలా సాగాలని.. గత ప్రభుత్వం గానీ ఈ ప్రభుత్వం గానీ పూడికతీత అంశాన్ని నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు. పొలాల నుంచి డ్రెయిన్లలో…
బీజేపీ సీనియర్ నేత, ఫైర్ బ్రాండ్‌గా పేరున్న మాజీ సీఎం ఉమాభారతి సొంతపార్టీపైనే ఉద్యమాన్ని చేస్తున్నారు.. గత కొంత కాలంగా మద్యపాన నిషేధంపై పోరాటం చేస్తున్న ఆమె… తాజాగా, మధ్యప్రదేశ్‌లోని నివారీ జిల్లాలోని ఓర్చా పట్టణంలోని ఒక మద్యం షాపుపై ఆవు పేడను విసిరారు, బీజేపీ పాలిత రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం ఆమె డిమాండ్ చేశారు. మంగళవారం జరిగిన ఆ ఘటనకు సంబంధించిన వీడియోను ఉమాభారతి సోషల్ మీడియాలో పంచుకున్నారు.. మద్యం షాపు ఉన్న…
నేషనల్ హెరాల్డ్ మనీ ల్యాండిరింగ్ కేసులో రాహుల్ గాంధీని విచారణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతల నిరసనలు మిన్నంటాయి. దీంతో తెలంగాణ వ్యాప్తంగా టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన , ఆందళనలు జరుగుతున్నవిషయం తెలిసిందే. అయితే నిరసనలో భాగంగా.. నేడు చలో రాజ్‌భవన్‌కు కాంగ్రెస్ పిలుపు నిచ్చింది. సోమాజిగూడ నుంచి రాజ్‌భవన్ వరకు కాంగ్రెస్ నేతల ర్యాలీ చేపట్టనున్నారు. కాగా.. ఇవాళ దేశవ్యాప్త ఆందోళనకు ఏఐసీసీ చేపట్టనుంది. ఉదయం 10 గంటలకు పీజేఆర్ విగ్రహం వద్దకు…
ఎనిమిదేళ్ల కాలంలో కేంద్రంలో మోదీ నాయకత్వంలోని సంక్షేమ పథకాలు, అభివృద్ధి భేష్ అని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. మోదీ 8 ఏళ్ల పాలన గురించి మెదక్ లో జరిగిన సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 2014 కు ముందు కేసీఆర్ ఏం మాట్లాడాడు.. అధికారంలోకి వచ్చిన తరువాత ఏం చేస్తున్నాడో చెప్పాలి అని ప్రశ్నించాడు. కేసీఆర్ మాటలు, చేతలకు పొంతన ఉండదని అన్నారు. కష్టపడితే తెలంగాణలో అధికారం బీజేపీదే అని ఆయన అన్నారు.…
నేడు రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడనుండటంతో దేశంలో రాజకీయాలు వేడెక్కాయి. ఓ వైపు ఏకగ్రీవం కోసం బీజేపీ ప్రయత్నిస్తుండగా.. అభ్యర్థి ఎంపిక కోసం విపక్షాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. బీజేపీ కూడా ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించకపోవడం గమనార్హం. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలు ప్రతిపాదించే అభ్యర్థికి.. అధికార పక్షం మద్దతు పలకనుందా? ఈ ఎన్నికను ఏకగ్రీవం చేసే దిశగా భాజపా అగ్రనేత రాజ్‌నాథ్ సింగ్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయా?… కాంగ్రెస్ లీడర్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు చూస్తే ఇలాంటి…
సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు ఏం ముఖం పెట్టుకుని సిద్దిపేట, గజ్వేల్ లో తిరుగుతున్నారని ఆయన మండిపడ్డారు. ఉపాధిహామీని వ్యవసాయానికి అనుబంధం చేయాలని, ఇప్పటికే మూడుసార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపామని, ఆ పని చేసుకొచ్చి మీ ముఖం చూపియండంటూ ఆయన విమర్శలు గుప్పించారు.…
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, ఉత్తర ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్య నాథ్ పై విమర్శలు గుప్పించారు. ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్, ప్రయాగ్ రాజ్, సహరాన్ పూర్ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. మాజీ బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాళ్ల దాడి, ఆస్తుల ధ్వంసం జరిగింది. దీంతో ఉత్తర్ ప్రదేశ్ లోని యోగీ సర్కార్ అల్లర్లను అణచివేయడంతో పాటు శాంతి భద్రతలకు భంగం కలిగించిన వారిపై…
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆదివారం నాడు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కీలకంగా సమావేశమై జాతీయ రాజకీయాలపై చర్చించారు. ఈ భేటీ వివరాలను ఆయన సోమవారం ప్రెస్‌మీట్ పెట్టి వివరించారు. ఈ సందర్భంగా బీజేపీపై ఉండవల్లి అరుణ్‌కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ విధానాలు దేశానికి ప్రమాదకరంగా మారాయన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఉండవల్లి తెలిపారు. తాజాగా ఉండవల్లి అరుణ్‌కుమార్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ బీజేపీ ప్రధాన…
దేశంలోని పేద వాడికి ఒక్కరికి కూడా కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పధకం అమలు చేయలేదని మంత్రి సత్యవతి రాథోడ్ మండి పడ్డారు. మహబూబాబాద్ జిల్లా లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. భారత దేశం అన్ని మతాల కులాల వేదికగా నిలిచిందన్నారు. భారత దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేస్తూ దేశ సంపద అంతయు కొంతమంది చేతుల్లో పెడుతున్నారని మండి పడ్డారు.…