Sadhvi Niranjan Jyoti comments on TRS and CM KCR: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ పెద్ద అంబర్ పేటలో జరిగింది. కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్, అసదుద్దీన్ ఓవైసీలపై నిప్పులు చెరిగారు కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి. ప్రజల సొమ్ము దోచుకుంటున్న వారి ఇళ్లపైకి…
రాష్ట్రంలో టీఆర్ఎస్ నేతల సభలకు డబ్బులిచ్చి జనాలను తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడిందని మునుగోడు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేసీఆర్.. ఏం ఘనకార్యం చేశావని దేశ స్థాయిలో కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నావ్ అంటూ ఆయన ప్రశ్నించారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఆంధ్రప్రదేశ్లో వివాదం కొనసాగుతోంది… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పరిణామాన్ని సమర్థిస్తుంటే.. విపక్షాలు మాత్రం మండిపడుతున్నాయి… వర్సిటీ పేరు మార్పుపై స్పందించిన కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి… విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. నందమూరి తారక రామారావు ఒక సామాజిక డాక్టర్… సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అని నమ్మిన వ్యక్తి.. కానీ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం అంటే మేం ఎన్టీఆర్కు అవమానంగానే భావిస్తున్నాం…
Devendra Fadnavis comments on uddhav thackeray: మహరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై విరుచుకుపడ్డారు. ఫడ్నవీస్ ను ఠాక్రే ఎప్పుడూ అంతం చేయలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి నన్ను అంతం చేయాలని చూశారు.. అది మీల్ల కాలేదు అని ఆయన అన్నారు. 2019 ఎన్నికల్లో ప్రధాని మోదీ ఫోటో చూపించి ఎన్నికల్లో పోటీ చేశారు.. ఆ తరువాత బీజేపీకి వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్, ఎన్సీపీలతో…
మునుగోడు ఉపఎన్నిక కోసం రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలను రచిస్తున్నాయి. ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పార్టీలు గెలుపు కోసం సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. విజయమే లక్ష్యం కాషాయ పార్టీ పావులు కదుపుతోంది. మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది.
Somu Veerraju: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఏలూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రామాలు అభివృద్ది చెందితే దేశం అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ సర్పంచులకు నిధులు పెంచారన్నారు. అయితే కేంద్రం ఇచ్చిన నిధులు సర్పంచులకు ఇవ్వకుండా వాటిని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని సోము వీర్రాజు ఆరోపించారు. అక్టోబర్ 2 నుంచి సర్పంచులకు ఇవ్వాల్సిన నిధుల కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నామని తెలిపారు. మోదీ ఇచ్చిన నిధులతో రోడ్లు వేస్తున్నారని..…