నేటి కాలంలో అవినీతి రహిత జీవితాన్ని గడపడం చాలా కష్టమైన పని అని... ఎందుకంటే రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడాలని డిమాండ్ చేస్తున్నారని కర్ణాటక న్యాయ, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి జేసీ మధుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేశంలోని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు సహా అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలని జేడీయూ చీఫ్, బిహార్ సీఎం నితీష్ కుమార్ కోరారు. ఈ "ప్రతిపక్షాల ప్రధాన ఫ్రంట్" 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాషాయ పార్టీ ఘోరంగా ఓడిపోయేలా చేస్తుందని ఆయన అన్నారు.
BJP state in-charges meeting: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సిద్ధం అవుతోంది. కేంద్ర మంత్రులు, జాతీయాధ్యక్షుడు, ఇతర కీలక నేతలు తరుచుగా పలు రాష్ట్రాలను సందర్శిస్తున్నారు. ఇటీవల బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 2024 లోక్ సభ ఎన్నికలపై చర్చ జరిగింది. గతంలో బీజేపీ పార్టీ తక్కువ మెజారిటీతో ఓడిపోయిన 100కు పైగా నియోజకవర్గాలపై ప్రత్యేక…
Gujarat AAP leader arrested for raping: ఈ ఏడాది చివర్లో గుజరాత్ ఎన్నికలు జరగబోతున్నాయి. మరోసారి బీజేపీ గుజరాత్ లో గెలుపొందాలని భావిస్తోంది. 2024 ఎన్నికల ముందు సెమిఫైనల్స్ గా ఎన్నికలను భావిస్తోంది. ఇదిలా ఉంటే పంజాబ్ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న ఉత్సాహంతో గుజరాత్ లో కూడా పాగా వేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది. ఇదిలా ఉంటే ఆప్ నేతలు మాత్రం పలు కేసుల్లో ఇరుక్కుంటుండం ఆ పార్టీకి మింగుడపడటం లేదు.
Ankita Bhandari Case: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అంకితా భండారీ హత్య కేసు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. బీజేపీ నేత కుమారుడి రిసార్టులో పనిచేస్తున్న అంకితాను హత్య చేశారు. ఈ హత్యలో బీజేపీ నేత వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్య కీలక నిందితుడిగా ఉన్నారు. దీంతో శుక్రవారం వినోద్ ఆర్యను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు బీజేపీ ఉత్తర్వులు జారీ చేసింది.
Mithun Chakraborty comments on TMC: బీజేపీ నేత, సినీ నటుడు మిథున్ చక్రవర్తి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కోల్కతాలో మీడియాతో మాట్లాడిన ఆయన అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)పై విమర్శలు గుప్పించారు. గత జూలైలో మిథున్ చక్రవర్తి.. టీఎంసీ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారని వ్యాఖ్యానించారు. తాజాగా మరోసారి ఇదే విధమైన వ్యాఖ్యలు చేశారు. తాను జూలైలో చేసి వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మిథున్ చక్రవర్తి అన్నారు. టీఎంసీకి చెందిన 38…
బిహార్లో బీజేపీ, ఆర్జేడీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. వృద్ధాప్యం, ఆరోగ్య సమస్యలు, న్యాయపరమైన సమస్యలతో చాలా కాలం పాటు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని తేలిగ్గా తీసిపారేశారు.