TRS Party: కేంద్ర మంత్రులు దగుల్బాజీ మాటలు మానుకోవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TRS MLAs fire on Union Minister Kishan Reddy: కేంద్ర మంత్రులు దగుల్బాజీ మాటలు మానుకోవాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ఫైర్ అయ్యారు. హన్మకొండలో ప్రెస్ మీట్ నిర్వహించి బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీని తన్ని తరిమే సమయం వచ్చిందని మండిపడ్డారు. ఖబడ్దార్ బీజేపీ నేతల్లారా అంటూ హెచ్చరించారు. -తెలంగాణ హక్కులు తుంగలో తొక్కితే మసైపోతారు జాగ్రత్త అంటూ మండిపడ్డారు. ఎందుకు మాపై ఈ వివక్ష..? ఎందుకు ఇంతలా విషం కక్కుతున్నారు? అని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్ర విభజన చట్టంలోని కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు. లేకపోతే మరోపోరు తప్పదు అని హెచ్చరించారు. బతుకమ్మ ఉత్సవాలలో ఎక్కడా కంటికి కనిపించని బీజేపీ నేతలు ఇప్పుడు కపట ప్రేమలు నటిస్తున్నారని విమర్శించారు. -కిషన్ రెడ్డి మాటలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణలోని ప్రతీ ఒక్కరిని తీవ్ర నిరుత్సాహపర్చాయని అన్నారు. బీజేపీ నేతలది తెలంగాణపై కపట ప్రేమ అంటూ విమర్శించారు. పార్లమెంట్ కు అంబేడ్కర్ పేరు పెట్టాలంటే బీజేపీ ఎమ్మెల్యేలు అడ్రస్ లేకుండా పోయారని ఎద్దేవ చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి రాష్ట్ర విభజన చట్టంలోని హామీలు అమలుచేయాలని టీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేశారు.
Sky Movie: చివరి దశలో ఒంటరి వ్యక్తి జీవిత కథ!
Also Read
తాజావార్తలు
-
Honor 600 Elite 5G: హానర్ 600 Elite 5G లాంచ్.. 108MP కెమెరా, 8,100mAh బ్యాటరీ, IP69K రేటింగ్
-
Kajal Aggarwal: డిన్నర్‌కి వెళ్లినా ఫోన్లతోనేనా? విడాకులపై కాజల్ షాకింగ్ కామెంట్స్.. భర్తతో మాత్రం ఇలా!
-
Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ నాలుగు రాశుల వారికి నేడు పట్టిందల్లా బంగారమే!
-
US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!