Vizag Railway Zone: విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రం అలా.. ఏపీ బీజేపీ నేతలు ఇలా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రం వాదనల ఒకలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతల మాటలు మాత్రం మరోలా ఉన్నాయి.. విశాఖపట్టణంలో రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో గందరగోళానికి తెరదించుతూ సాధ్యం కాదని తేల్చిచెప్పేసింది కేంద్రం… విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయడం లాభదాయకం కాదని రైల్వే శాఖ స్పష్టంగా చెప్పేసింది. విభజన సమస్యలు, హామీలపై ఢిల్లీలో కేంద్ర హోంశాఖ నిన్న సమావేశం నిర్వహించింది. హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా నేతృత్వంలో రెండు గంటలకుపైగా ఈ సమావేశం జరిగింది. ఏపీ, తెలంగాణకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో రైల్వే జోన్, విభజన సమస్యలు సహా మొత్తం 14 అంశాలపై చర్చ జరగగా… విశాఖకు రైల్వే జోన్ విషయంపై కుండబద్దలు కొట్టిన కేంద్రం.. రైల్వే జోన్ ఏర్పాటు సాధ్యం కాదని స్పష్టం చేసింది.. జోన్ ఏర్పాటు లాభదాయకం కాదని, అందుకనే డీపీఆర్‌ను ఆమోదించలేదని రైల్వే బోర్డు చైర్మన్ తెలిపారు.. అయితే, దీనిపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఆధ్వర్యంలోని బృందం అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా సమాచారం.. జోన్ ఏర్పాటు లాభదాయకం కాదన్న విషయం తెలిసే దానికి చట్టపరంగా హామీ ఇచ్చారని గుర్తు చేసింది. లాభాలు వస్తే మాత్రం అప్పుడు ఏ చట్టంతో అవసరం లేకుండానే రైల్వే జోన్‌ను ఏర్పాటు చేసేదని చెప్పినట్టుగా తెలుస్తోంది..
Read Also: Whatsapp: వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్.. జూమ్, గూగుల్ మీట్‌లా…!
Also Read
- OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
- Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
ఇక, రైల్వే బోర్డు చైర్మన్ వ్యాఖ్యలపై స్పందించిన అజయ్‌భల్లా.. జోన్ ఏర్పాటు సాధ్యం కాదన్న విషయాన్ని అధికారుల స్థాయిలోనే నిర్ణయించేయడం సరికాదని, రైల్వే జోన్ విషయం రాజకీయ పరమైన అంశం కాబట్టి దానిని కేబినెట్ ముందు పెడితే అది ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందని సూచించారట.. అయితే, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం.. ఇంకా కేంద్రంపై నమ్మకంతోనే ఉన్నారు.. విశాఖ రైల్వే జోన్ ను కేంద్ర మంత్రి త్వరలో ప్రారంభిస్తారన్న ఆయన.. రైల్వే జోన్ వియషంలో ఎటువంటి వివాదాలు లేవన్నారు.. రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర కెబినెట్ ఆమోదం తెలిపింది.. పనులు జరుగుతున్నాయి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం రైల్వే ప్రాజెక్టులకు భూమి సేకరించాల్సి ఉందన్నారు.. చక్రం తిప్పిన నాయకుడు నేషనల్ ఫ్రంట్ కన్వీనరుగా ఉన్న సమయంలో ఏపీకి ప్రాజెక్టులు ఎందుకు తేలేదు..? అని ప్రశ్నించిన ఆయన.. అన్ని విషయాలు ప్రజల్లోకి తీసుకెళ్తాం అన్నారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్చ భారత్ లో పాల్గొన్న సోము వీర్రాజు.. ఈ సందర్భంగా విశాఖ రైల్వే జోన్‌పై స్పందించారు.
తాజావార్తలు
-
Dhruv Vikram DV4: ఇన్ని రోజుల ‘DV4’ వివాదానికి ఎండ్ కార్డ్.. రమేష్ వర్మతోనే ధృవ్ విక్రమ్ సినిమా!
-
Vijay Ajith Kumar: అజిత్ లే మాన్స్ రేస్‌కు త్రిషా కృష్ణన్.. విజయ్‌తో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్‌లో చర్చ
-
India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
-
AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
-
BRICS Summit 2026: మోడీ-జిన్‌పింగ్ భేటీ.. బ్రిక్స్ ఉమ్మడి ప్రకటన.. సదస్సు తొలి రోజు 10 కీలక విషయాలు
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!