Kanna Lakshmi Narayana: బీజేపీ సీనియర్ నేత, ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ సర్కారుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మైనింగ్, లిక్కర్, ఎర్రచందనం స్మగ్లింగ్, భూ కుంభకోణాలతో జగన్ దోపిడీ వ్యవస్థను నడుపుతున్నారని తిరుపతిలో నిర్వహించిన ‘బీజేపీ ప్రజాపోరు వీధి సభ’లో కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని.. ఆయన అస్తవ్యస్త పాలనతో జనం విసిగిపోయారని ఆరోపించారు. వైసీపీ అసమర్థపరులపై తాము పోరాటం…
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా విశ్వాస పరీక్షకు సిద్ధమవుతున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మెజారిటీ పరీక్ష కోసం రాష్ట్ర అసెంబ్లీని సెప్టెంబర్ 22న ప్రత్యేక సమావేశానికి పిలిచినట్లు ప్రకటించారు.
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, కిరెన్ రిజిజు సమక్షంలో కాషాయ కండువాను కప్పుకున్నారు.
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి బీజేపీ గట్టి షాకిచ్చింది. నందిగ్రామ్లోని ఓ సహకార సంఘానికి జరిగిన ఎన్నికల్లో మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
Danam Nagender: దమ్ముంటే గిరిజన రిజర్వేషన్లు ఆపి చూడాలని మా సీఎం సవాల్ విసిరారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ పాలన బ్రిటీష్ వారి పరిపాలనలా ఉందని టీఆర్ఎస్ విమర్శించారు. ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షాను బూచిలా చూపిస్తూ, బీజేపీ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రానికి దమ్ముంటే గిరిజన రిజర్వేషన్లు ఆపి చూడాలని మా సీఎం సవాల్ విసిరారని దానం నాగేందర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర…
BJP MP Laxman: 8 ఏళ్ల నుంచి గిరిజనులకు 10 % రిజర్వేషన్లు జీవో ఎందుకు ఇవ్వలేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు. గిరిజనుల రిజర్వేషన్లపై కేసీఆర్ డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. కాగా.. బీజేపీ స్టేట్ ఆఫీసులో మోడీ ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించి అనంతరం మాట్లాడుతూ.. రిజర్వేషన్ల అమలుపై రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలయ్యే జీవోలన్నింటికి కేంద్రం ఆమోదం ఉందా? అని ప్రశ్నించారు. అంతేకాదు.. ఎన్టీఆర్ హయాంలో ఒక్క జీవోతో రిజర్వేషన్లు పెంచారని…