MP Yusuf Pathan: ఒడిశా రాష్ట్రంలో పశ్చిమ బెంగాల్ కి చెందిన వలస కార్మికులపై జరిగిన దాడిపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బెర్హంపూర్ ఎంపీ, భారత మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.
Congress vs BJP: కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గోగోయ్ పై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఎక్స్ (ట్విట్టర్ ) వేదికగా చేసిన పోస్టులో.. ఎంపీ గోగోయ్ పాకిస్తాన్, నేపాల్ దేశాల్లో పర్యటనలకు సంబంధించిన "స్పష్టమైన ఆధారాలు" తన దగ్గర ఉన్నాయని పేర్కొన్నారు.
Jagga Reddy: రాహుల్ గాంధీ జోడో యాత్రలో దేశ ప్రజల సమస్యలకు పరిష్కారం చేసే దిశగా అడుగులు వేశారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. భారత్ జోడో యాత్రలో ప్రధాన అంశం కుల గణన.. కుల గణన చేయాలని రాహుల్ గాంధీ పదే పదే చెప్పారు.
Kishan Reddy: ప్రధాని మోడీ నేతృత్వంలో క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. త్వరలో జరగబోయే జనగణనలో కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
Eatala Rajendar: కేంద్రం చేపట్టబోతున్న కులగణనపై ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. ఈ ప్రకటన బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు గౌరవాన్ని కలిగించడమే కాకుండా.. చరిత్రాత్మక నిర్ణయంగా పేర్కొన్నారు. ఈటల మాట్లాడుతూ.. స్వతంత్ర భారతదేశంలో 48 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ బీసీల జనగణన చేపట్టలేదని, అణగారిన వర్గాలకు ఛాంపియన్లా నటిస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీల ఓట్లను మాత్రమే కొల్లగొట్టారని కాంగ్రెస్ ను విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు తగిన చర్యలు తీసుకోకుండా, ప్రతిపక్షంలోకి…
Rahul Gandhi: కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కింపుతో పాటు ‘‘కుల గణన’’ చేస్తామని బుధవారం సంచలన ప్రకటన చేసింది. అయితే, ఈ నిర్ణయంపై కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. కాంగ్రెస్ ఒత్తిడి మేరకే కేంద్రం తలొగ్గిందని, కుల గణనకు అంగీకరించిందని ఆయన అన్నారు.
తెలంగాణలో బీజేపీ వ్యవహారాల మీద ఆ పార్టీ ఢిల్లీ నాయకత్వం ఇక సీరియస్గా ఫోకస్ పెడుతున్నట్టు కనిపిస్తోంది. అందులో భాగంగానే... రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సర్ ఇక్కడి నేతలకు గట్టిగా క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన సంస్థాగత ఎన్నికల సమావేశం జరిగింది. ఈ మీటింగ్కు రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా సంఘటన సంరచన ఇన్ఛార్జ్లు హాజరయ్యారు.
Bandi Sanjay Kumar: దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతోపాటు కుల గణన నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. సాహసోపేత నిర్ణయం తీసుకున్న ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ప్రజలకు ఎంతో ప్రయోజనం కలగబోతోందని, అత్యంత శాస్త్రీయంగా కేంద్రం నిర్వహించే ఈ సర్వేలో కులాల వారీగా ఎంత…
ఒక్క స్కూల్… ఒకే ఒక్క స్కూల్ ఆ ఇద్దరు నేతల మధ్య అగ్గి పెట్టిందా? నేను చెప్పిన చోటే ఏర్పాటు చేయాలంటే…. కాదు నేను చెప్పిన చోటే కావాలంటూ… ఒకరు స్టేట్ లెవెల్ లో ఇంకొకరు సెంట్రల్ లెవెల్ లో పైరవీలు చేస్తున్నారా..? అసలా బడితో… ఇద్దరు నేతలకు వచ్చే ప్రయోజనం ఏంటి..? ఎక్కడుందా స్కూల్..? సమరానికి సై అంటున్న నేతలు ఎవరు..? నవోదయ విద్యాలయం. గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో 1986లో కేంద్ర…
BJP vs Congress: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయం మొదలైంది. కాంగ్రెస్ ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేస్తూ..‘‘అవసరమైన సమయాల్లో మిస్ అవుతారు’’ అని కామెంట్ చేసింది. ప్రధానిని సూచించే ఒక ఫోటోని పోస్ట్ చేసి, దానికి తల లేకుండా ఉంచింది. దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ని టార్గెట్ చేస్తూ బీజేపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు.