Congress vs BJP: రైల్వే టికెట్లపై ఆపరేషన్ సింధూర్ ప్రచారం.. బీజేపీపై కాంగ్రెస్ ఆగ్రహం..
- రైల్వే టికెట్లపై ఆపరేషన్ సింధూర్ ప్రచారం..
- రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ ఉపయోగించుకుంటుందని కాంగ్రెస్ ఫైర్..
- బీహార్ ఎన్నికల కోసం మోడీ రైల్వే టికెట్లపై ప్రచారం చేసుకుంటున్నారు: కాంగ్రెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress vs BJP: ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్, పీవోకేలోని ఉగ్ర స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. తాజాగా రైల్వే ఈ- టికెట్లపై ఆపరేషన్ సింధూర్‌కు సంబంధించిన ప్రకటనలు రావడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడుతోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ సైనిక చర్యలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటుందని ఆరోపించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ ఎక్స్ వేదికగా ఒక ఫొటోను షేర్ చేశాడు. భారతీయ రైల్వేకి సంబంధించిన ఈ-టికెట్ పై ప్రధాని మోడీ ఫొటోతో పాటు ఆపరేషన్ సింధూర్‌కి సంబంధించిన ప్రకటన దర్శనమిస్తుంది. మోడీ ప్రభుత్వానికి ప్రకటనలపై ఎంత ఇంట్రెస్ట్ ఉందో చెప్పడానికి ఇదో ఉదాహరణ అని ఆయన రాసుకొచ్చారు.
Read Also: Forced Conversion: బలవంతపు మత మార్పిడికి రాజ్యాంగం మద్దతు ఇవ్వదు..
Also Read
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
- Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
అయితే, ఆపరేషన్ సింధూర్‌ను రైల్వే టికెట్లపై ప్రకటన చేయడం దారుణం.. మన సైన్యం పరాక్రమాన్ని ఓ ఉత్పత్తిలా మార్చేశారు అని కాంగ్రెస్ సీనియర్ నేత కమలనాథ్ మండిపడ్డారు. ఇది దేశ భక్తి కాదు.. బేరసారమే అని ఆరోపించారు. రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసమే సైన్యాన్ని ఉపయోగించుకోవడమే ఇందుకు నిదర్శనం అన్నారు. ఇలాంటి పద్ధతులను వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశారు. ఇక, ఈ విషయంపై బీఎస్పీ ఎంపీ కున్వర్ డానిష్ అలీ సైతం స్పందించారు. ప్రధాని మోడీ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్‌ను ఎన్నికల కోసం అవకాశంగా మార్చుకుంటుందని ఆరోపించారు.
Read Also: Rajiv Yuva Vikasam : ‘రాజీవ్ యువ వికాసం’పై సర్కార్ కీలక నిర్ణయం
ఇక, కాంగ్రెస్ చేస్తున్న విమర్శలపై రైల్వే బోర్డు అధికారి దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్‌ను భారత సైనిక దళాలు సక్సెస్ ఫుల్ గా నిర్వహించినందుకు గర్విస్తున్నాం అన్నారు. దేశం మొత్తం వారి ధైర్యాన్ని చూసి ఆనందం వ్యక్తం చేస్తుందన్నారు. భారతీయ రైల్వే ఈ సందేశాన్ని టికెట్లపై హైలెట్ చేసి.. ఆపరేషన్ సింధూర్‌ను ప్రదర్శించే త్రివర్ణ పతాకాలను అన్ని రైల్వే స్టేషన్లలో ఉంచాలని నిర్ణయించింది అని తేల్చి చెప్పారు. ఈ ఆపరేషన్ గురించి దేశంలోని ప్రతి గ్రామానికి చేరుకోవాలని మేము భావిస్తున్నాం.. అంతే తప్ప ఇది రాజకీయ ప్రయోజనం కోసం కాదని రైల్వే బోర్డు అధికారి దిలీప్ కుమార్ వెల్లడించారు.
मोदी सरकार किस क़दर विज्ञापनजीवी है इसका उदाहरण देखिए कि रेलवे टिकट पर ऑपरेशन सिंदूर को मोदी के विज्ञापन के तौर पर इस्तेमाल किया जा रहा है।
ये सेना के पराक्रम को भी प्रोडक्ट की तरह बेच रहे हैं। इनसे देशभक्ति नहीं सौदेबाज़ी ही हो सकती है। @INCIndia pic.twitter.com/XPcf9O7REB— Piyush Babele||पीयूष बबेले (@BabelePiyush) May 18, 2025
తాజావార్తలు
-
Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
-
Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యామిలీ సినిమాల’ హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!