ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకులు పాక్ పై ప్రేమ ఉంటే అక్కడికే వెళ్లండి అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై చామల కిరణ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎంపీ చామల మాట్లాడుతూ.. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి 140 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రజలు గమనించాలని కోరారు.…
ఆరెస్సెస్ పెద్దల్ని ప్రసన్నం చేసుకుంటే కమలం పార్టీలో పదవులు చాలా ఈజీగా వస్తాయన్న ప్రచారం ఎప్పట్నుంచో ఉంది. అదే అభిప్రాయంతో...బీజేపీ లీడర్స్ చాలామంది సంఘ్ ఆఫీసులకు క్యూ కడుతుంటారు కూడా. అయితే... ఇటీవలి కాలంలో ఇది మరీ శృతిమించిపోయిందని, నిన్నగాక మొన్న పార్టీ వేరే పార్టీలనుంచి బీజేపీలోకి మారిన వాళ్ళు కూడా మాకు పదవులు అంటూ తలుపు తడుతుండటం ఆర్ఎస్ఎస్ నేతలకు చిరాకు తెప్పిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.
IND vs Ban: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ లో 26 మంది పర్యాటకులను బలిగొన్న ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారతదేశం పాకిస్తాన్‌పై కఠినమైన చర్యలు విధిస్తుంది. ఈ నేపథ్యంలో పాక్ కు దగ్గర అవుతున్న బంగ్లాదేశ్‌పై కూడా ఇలాంటి చర్యలు తీసుకోవాలని ఈశాన్య భారతదేశంలోని కీలక రాజకీయ నాయకులు, పలు పార్టీలు పిలుపునిచ్చాయి.
ఏపీ రాజ్యసభ స్థానానికి బీజేపీ అభ్యర్థి ఖరారు అయ్యారు. రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ నేత పాక వెంకట సత్యనారాయణ పేరును ఎన్డీఏ కూటమి ఖరారు చేసింది. భీమవరంకు చెందిన సత్యనారాయణ.. ప్రస్తుతం ఏపీ బీజేపీ డిసిప్లీనరీ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. తమిళనాడుకు చెందిన అన్నామలై, ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ పేర్లు రేసులో వినిపించినా.. చివరకు సత్యనారాయణకు అవకాశం దక్కింది. ఇటీవల విజయసాయి రెడ్డి రాజీనామాతో రాజ్యసభలో ఓ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. విజయసాయి…
ఇటీవల విజయసాయి రెడ్డి రాజీనామాతో రాజ్యసభలో ఓ స్థానం ఖాళీ అయ్యింది. మరో రెండేళ్ల పదవీ కాలం ఉన్న నేపథ్యంలో ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఏపీలో ఖాళీ అయిన ఈ రాజ్యసభ స్థానం భర్తీపై ఉత్కంఠ కొనసాగుతోంది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ గడువు ముగియనుంది. అయినా కూడా ఇప్పటివరకు కూటమి నుంచి నామినేషన్ దాఖలు అవ్వలేదు. ఇప్పటివరకు అభ్యర్థిని ఖరారు చేయకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. విజయ్ సాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ…
CM M K Stalin: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్ర దాడి తమిళనాడు రాష్ట్రంలో జరగదని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. ఇక, మతతత్వం ఎన్నటికీ తమిళనాడును ఆక్రమించదని తేల్చి చెప్పారు.
బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర వెనకబాటుకు కారణం ఆ రెండు జాతీయ పార్టీలే అని దుయ్యబట్టారు. కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మె్ల్యే రాజా సింగ్ సంచలన కామెంట్స్ చేశారు. రాజా సింగ్ మాట్లాడుతూ.. కెసిఆర్ అన్ని అబద్ధాలే మాట్లాడారని అన్నారు. కెసిఆర్ అంటే జుటా.. మోడీ ప్రధానిగా ఉన్నప్పుడు దేవుడని పొగిడావు.. అప్పుడు ఎందుకు నిధుల గురించి అడగలేదు.. భయ పడ్డావ అంటూ ఎద్దేవా చేశారు.…
Mani Shankar Aiyar: కాంగ్రెస్ నేత మణి శంకర్ అయ్యర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిపై మాట్లాడుతూ.. ‘‘భారత్ పాక్ విభజన యొక్క పరిష్కారం కాని సమస్య’’తో ముడిపెడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే, అయ్యర్ వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. బీజేపీ నేత నళిన్ కోహ్లీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేత, దేశ మొదటి ప్రధాని నెహ్రూ అతడి విధానాలను అయ్యర్ ప్రశ్నల్ని లేవనెత్తుతున్నారని అన్నారు.
Himanta Biswa Sarma: కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ టార్గెట్‌గా అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘‘మీరు 15 రోజులు పాకిస్తాన్లో బస చేశారా..? మీ భార్య పాకిస్తాన్‌కి చెందిన ఎన్జీవో నుంచి జీతం పొందుతుందా..?’’ అని ప్రశ్నలు సంధించారు. ఎక్స్ వేదికగా గొగోయ్‌కి ప్రశ్నల వర్షం కురిపించారు. ఎంపీ భార్య, వారి పిల్లల పౌరసత్వ స్థితిని కూడా ఆయన ప్రశ్నించారు.
దక్షిణాది ప్రజలకు మేలు చేస్తాం అని, ప్రజల హృదయాలలో చోటు సంపాదించి ఇక్కడ కూడా జెండా ఎగరేస్తాం అని కేంద్రమంత్రి కమ్ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులలో అధికారంలోకి వస్తామన్నారు. దక్షిణ భారతదేశానికి ప్రధాని మోడీ నేతృత్వంలో ఎలాంటి అన్యాయం జరగదన్నారు. ప్రధాని మోడీ పేద కుటుంబం నుంచి వచ్చారని.. పేద ప్రజల గుండె చప్పుడు ఆయనకు తెలుస్తుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మన్…