Kishan Reddy: కొమరంభీం జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల అభివృద్ధి జరుగుతోంది అన్నారు.
కొమరంభీం జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అందరికీ నమస్కారం.. బాగున్నారా.. అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. పండిట్ దీన్ దయాళ్ గారి సామాజిక చింతన మాకు ఆదర్శం.. మీ జిల్లాకు రావడం చాలా ఆనందంగా ఉంది నాకు మీ సమస్యలు వినే అవకాశం…
Milind Deora: పహల్గామ్ ఉగ్రదాడితో దేశం మొత్తం ఆగ్రహావేశాలతో ఉంటే, శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తన కుటుంబంతో యూరప్‌లో సెలవులు గడిపేందుకు వెళ్లారని శివసేన నేత మిలింద్ దేవరా ఘాటు విమర్శలు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన సమయంలో ఉద్ధవ్ ఠాక్రే యూరప్‌లో హాలీడేస్ గడుపుతున్నారని మండిపడ్డారు.
India Pakistan Tension: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అయితే, ఈ భారత్ తీసుకుంటున్న నిర్ణయాలతో పాకిస్తాన్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ అన్నారు. ప్రధాని మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే భయంతో పాకిస్తాన్ మంత్రులు, ఆర్మీ జనరల్స్ దేశం విడిచి పారిపోయేందుకు టిక్కెట్లు బుక్ చేసుకున్నారని ఆరోపించారు.
Rahul Gandhi: కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ ‘‘శ్రీరాముడి’’ ఉనికి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని ఒక యూనివర్సిటీలో జరిగిన సంభాషణలో మాట్లాడుతూ.. ‘‘ రాముడు పురాణాలకు చెందిన వ్యక్తి’’గా అభివర్ణించారు. రాముడు పాత్ర కల్పితం అని అర్థం వచ్చేలా మాట్లాడటంపై బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. రాహుల్ గాంధీ హిందూ వ్యతిరేక మనస్తత్వం కలిగిన వాడని, రాముడి వ్యతిరేకి అని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్రౌన్ యూనివర్సిటీలోని వాట్సన్…
కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆపరేషన్ కగార్ పై హాట్ కామెంట్స్ చేశారు. ఆపరేషన్ కగార్ ఆగదు… మావోయిస్టులు ఆయుధాలు వీడాల్సిందే… లొంగిపోవాల్సిందేనని తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ.. మావోలతో చర్చలు జరిపే ప్రసక్తే లేదు.. నక్సల్స్ హింసలో ఎందరో లీడర్లు చనిపోయారు… పోలీసులు చనిపోయారు… అప్పుడు చర్చల గురించి.. మావోయిస్టులకు మద్దతుగా కేసీఆర్, రేవంత్ ఎందుకు మాట్లాడలేదు.. మావోయిస్టు పార్టీ నిషేధ సంస్థ వారితో చర్చలు ఉండవు. Also Read:Medak: పెళ్లయిన మూడు నెలలకే…
Asaduddin Owaisi: కేంద్రం ఇటీవల జనాభా లెక్కలతో పాటే ‘‘కులగణన’’ చేస్తామని ప్రకటించింది. 2024 ఎన్నికల ముందు నుంచి కాంగ్రెస్‌తో సహా పలు ఇండీ కూటమి పార్టీలు కులగణనను డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ-ఎన్డీయే సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ కులగణనపై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నల్ని లేవనెత్తారు. కులగణనకు కేంద్రం ఒక టైమ్ లైన్ ఉండాలని కోరారు.
BJP: పహల్గామ్ దాడి తర్వాత పలువురు కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీని ఇరకాటంలో పడేస్తున్నాయి. ఇప్పటికే, కొందరు నేతలు మాట్లాడుతూ.. ఉగ్రవాదులు ‘‘హిందువులు’’ అని అడిగి చంపలేదు అని అన్నారు. తాజాగా, పంజాబ్ మాజీ సీఎం, ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీగా ఉన్న చరణ్‌జీత్ సింగ్ చన్నీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. శనివారం, బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ భారత సాయుధ దళాలను నిరాశ…
Bhatti Vikramarka : కేంద్ర ప్రభుత్వం కులగణనపై తీసుకున్న తాజా నిర్ణయం తెలంగాణ ప్రభుత్వ విజయానికి నిదర్శనమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని మల్లన్నపాలెం గ్రామంలో రామలింగేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటిగా కులగణన చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రజల అభివృద్ధిని దృష్టిలో…
కుల గణనపై ప్రధాని మోడీకి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ లేఖ రాశారు. జనాభా లెక్కలతో పాటు కుల గణన చేపట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ఆర్జేడీ స్వాగతించింది.