Uddav Thackeray: శివసేన పార్టీని, విల్లు-బాణం గుర్తును ఏక్ నాథ్ షిండే వర్గానికి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఇది ఉద్దవ్ ఠాక్రే వర్గానికి భారీ ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. అయితే ఈసీ నిర్ణయంపై సుప్రీంకోర్టులో పోరాడుతామని ఉద్దవ్ ఠాక్రే స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే శనివారం తన వర్గం నేతలు, కార్యకర్తలతో ఉద్దవ్ ఠాక్రే సమావేశం అయ్యారు. ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాని మోదీకి బానిసగా…
Nitish kumar: 2024 సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాల ఐక్యత కోసం బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ హా అన్ని ప్రతిపక్షాలు చేతులు కలపాలని కోరారు. యునైటెడ్ ఫ్రంట్ బీజేపీని 100 కన్నా తక్కువ సీట్లకు పరిమితం చేయగలదని అన్నారు. కాంగ్రెస్ తో పాటు విపక్షాలు హాజరైన ఓ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Delhi Mayor Elections: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు మార్గం సుగమం అయినట్లే కనిపిస్తోంది. తాజాగా సుప్రీంకోర్టులో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కు భారీ విజయం దక్కింది. మేయర్ ఎన్నికపై సుప్రీం కీలక తీర్పు వెల్లడించింది. లెఫ్టినెంట్ గవర్నర్ నియమించిన సభ్యులు ఓటేయరాని సుప్రీంకోర్టు శుక్రవారం వెల్లడించింది. మేయర్ ఎన్నికపై బీజేపీ, ఆప్ మధ్య ఉద్రిక్తత ఏర్పడింది. ఇప్పటికే మూడు సార్లు మేయర్ ఎన్నిక వాయిదా పడింది.
Asaduddin Owaisi: హర్యానాలోని భివానీలో ఇద్దరు ముస్లిం యువకుల హత్యలు పొలిటికల్ దుమారాన్ని రేపుతున్నాయి. బీజేపీ లక్ష్యంగా విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. భజరంగ్ దళ్ వ్యక్తులే ఇద్దరు వ్యక్తులను హత్య చేశారని ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. గో సంరక్షులను బీజేపీ కాపాడుతోందని.. హర్యానా ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్దారు. జునైడ్, నాసిర్ ల మరణాలు అమానవీయం అని ఓవైసీ అన్నారు. గో రక్షక్ అనే ముఠానే వీరద్దరిని చంపిందని.. వారికి…
George Soros On PM Modi: భారత వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ వ్యవహారంలో బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందిస్తోంది. అదానీ స్టాక్ మార్కెట్ లో ఎదుర్కొంటున్న ఇబ్బందులు ‘ భారత్ తో ప్రజాస్వామ్య పునరుజ్జీవనం’ వస్తుందని..ప్రధాని నరేంద్రమోదీ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తోంది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ..
Purandeswari Vs GVL: ఆంధ్రప్రదేశ్లో కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా ఎపిసోడ్ కాకరేపుతుండగా.. రాష్ట్ర బీజేపీలో మరో వివాదం మొదలైంది.. సీనియర్ నేత, బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత పురంధేశ్వరి.. అన్ని పథకాలకూ ఎన్టీఆర్, వైఎస్ఆర్ పేర్లే పెడుతున్నారంటూ గురువారం రోజు జీవీఎల్ వ్యాఖ్యానించారు.. అన్ని పథకాలకు ఆ ఇద్దరి పేర్లానా? ఇంకా ఎవరూ లేరా? అని ప్రశ్నించారు జీవీఎల్.. రాష్ట్రంలో రాజకీయాలు కేవలం..…