మోడీ ప్రభుత్వం అదానీ కోసం అనేక మందిపై ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు చేసింది.. చేస్తోందని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముంబై ఎయిర్ పోర్ట్ అంశంలో జీవీకేకు అప్పు ఇవ్వలేదు కానీ.. అదానీకి మాత్రం కేంద్రం 13వేల కోట్లు మాఫీ చేసిందన్నారు. మాదకద్రవ్యాలు అమ్మేవాన్ని, కొనే వాన్ని పట్టుకోవడం కాదని, అది ఎక్కడి నుంచి వస్తోందో అక్కడ చర్యలు తీసుకోవాలన్నారు.
Also Read : Road Accident: ఏపీలో ఘోర రోడ్డుప్రమాదం.. పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ఆరుగురు మృతి
అదానీ మాయలఫకీరు కంటే దారుణంగా తయారు అయ్యాడని ఆయన విమర్శించారు. ప్రభుత్వ సంస్థల నుంచి మెజారిటీ ఇన్వెస్ట్మెంట్ లు అదానీ సంస్థలకు ట్రాన్స్ఫర్ చేసింది కేంద్రమని, సెబీ, సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలు అదానీకి పిచ్చి కుక్కలలెక్క కాపలా కాస్తున్నాయన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రత్యర్థి రాజకీయ నాయకులను పట్టిపెట్టడానికి పనిచేస్తున్నాయన్నారు. అంతేకాకుండా.. ‘ఆప్, బీఆర్ఎస్ నాయకులపై దాడులు అందులో భాగమే. బీజేపీ నాయకులు రేపులు చేసినా పూలమాలలు వేసి బయట తిప్పుతున్నారు. దేశం చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. జాతీయ స్థాయిలో బీజేపీని వ్యతిరేకించే పార్టీలు, నేతలు కలవాలి. బీఆర్ఎస్ పార్టీ మొదట్లో బీజేపీతో కలిసి పనిచేసినా ఇప్పుడు వ్యతిరేకంగా ఉంది. సీపీఐ పార్టీ నాయకులు సన్యాసులు కాదు.. మా పార్టీ కూడా మఠం కాదు.
Also Read : Allari Naresh: అన్నా.. మరీ నువ్వలా భయపెట్టకే.. ‘నేను’ సినిమా గుర్తొస్తుంది
సీపీఐ నాయకులు ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ అధికారంలోకి రావాలనే మాకు ఉంటుంది. రేవంత్ రెడ్డి పార్టీకి మాకు వ్యతిగతంగా విబేధాలు లేవు. సోషల్ మీడియాలో కాంగ్రెస్, సీపీఐ కలుస్తున్నాయి అనే వార్తలను ఖండిస్తున్నాం. మర్రి చెన్నారెడ్డి నుంచి నేను రాజకీయాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు లేడు. పొలిటికల్ పార్టీ కార్యాలయాల పై దాడులు ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి లాంటి పరమ దుర్మార్గున్ని నేను నా రాజకీయ జీవితంలో చూడలేదు. లోకేష్ పప్పు అన్నారు జగన్మోహన్ రెడ్డి… మరి ఆ అప్పు పాదయాత్ర చేస్తే ఎందుకు ఆపుతున్నారు.
Also Read : Today (22-02-23) Stock Market Roundup: 4 రోజుల్లో 7 లక్షల కోట్లు ఫట్
పప్పుసుద్ద పాదయాత్ర చేస్తే బయపడి అపుతున్నారు.. కేసులు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి దృష్టిలో చంద్రబాబు ముసలోడు మరి ఆ ముసలోడు రోడ్ షో లను ఎందుకు అడ్డుకుంటున్నారు. చీమ కూడా పోనీ ప్రాంతంలో వివేకానంద ఎలా చనిపోయాడు.. ఎవరు చంపారు బయటవాళ్ళు చంపారా? జాతీయ స్థాయిలో మేము అన్ని అంశాల పై చర్చించుకుంటాం.’ అని నారాయణ వ్యాఖ్యానించారు.