ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రఘునందన్ రావును బద్నాం చేయడమే లక్ష్యంగా కొంతమంది పెట్టుకున్నారన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. దుబ్బాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నన్ను తిట్టడమే కొందరు పనిగా పెట్టుకున్నారని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. బీఆర్ఎస్ నేతలను చూస్తే దొంగనే దొంగ దొంగ అన్నట్టు కనిపిస్తోందన్నారు. అధికారంలో ఉన్న పార్టీ నేతలే ఎమ్మెల్యేను విమర్శిస్తూ కాలం గడపడం బాధాకరమన్నారు. మంత్రులుగా చేస్తున్న నేతలు ఏది పడితే అది మాట్లాడడం ఇంకా బాధాకరమని, దుబ్బాక వందపడకల ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేయాలని అసెంబ్లీ లో కోరితే పక్కన పెట్టి.. కేవలం రాజకీయాలు మాట్లాడడం సమంజసం కాదన్నారు రఘునందన్ రావు.
Also Read : CPI Narayana : అదానీ మాయల ఫకీరు కంటే దారుణంగా తయారయ్యాడు
నన్ను ఎన్ని తిట్టిన నాకు అభ్యంతరం లేదు నేను దుబ్బాక ప్రజల ఆశీస్సులతో మళ్లీ గెలిచి వస్తానన్నారు. అసెంబ్లీలో మైకు ఉందని మొన్న నామీద బద్నాం చేసే ప్రయత్నం చేశారు.. అయిన నేను కన్నీరు కార్చలేదని, దుబ్బాక లో అభివృద్ధి పనుల కోసం అడుగుతే ఎమ్మెల్యే ఏం చేయలేదని పదే పదే విమర్శించడం బాధాకరమన్నారు రఘునందన్ రావు.
Also Read : Road Accident: ఏపీలో ఘోర రోడ్డుప్రమాదం.. పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ఆరుగురు మృతి
మొన్న రామాయంపేటకు మంత్రి హరీష్ రావు కాల్వలకు రిబ్బన్ కట్ చేసి ఇంటికి చేరకముందే కాల్వ తెగింది.. గట్లుంది మీ పనితనమని ఆయన ఎద్దేవా చేశారు. అంతేకాకుండా.. ఉప ఎన్నికల్లో దుబ్బాక ప్రజలు కారు గుర్తు వద్దన్నందుకు మీరు కక్ష తీర్చుకుంటున్నారు. దుబ్బాక పై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఆయన మండిపడ్డారు. దుబ్బాక పై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల్లో దుబ్బాక ప్రజలు కారు గుర్తు వద్దన్నందుకు మీరు కక్ష తీర్చుకుంటున్నారని ఆయన విమర్శించారు.