పటాన్ చెరువులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాపాల రెడ్డిగా మారారని బీజేపీ పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి జిల్లా శివరాత్రి జాగరణ పేరుతో మహిపాల్ రెడ్డి సినీ ఆర్టిస్టులతో హిందూ ధర్మాన్ని అపహస్యం చేశారని నందీశ్వర్ గౌడ్ మండిపడ్డారు.
సీఎం కేసీఆర్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. డేట్-టైమ్ ఫిక్స్ చెయ్, నేను రెడీ అంటూ ఛాలెంజ్ చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని గ్రామంలో జైలు నుండి విడుదలైన కమలాపూర్ కార్యకర్తలను పరామర్శించిన బండి సంజయ్ ఈ వాఖ్యలు చేశారు.
కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను బట్టబయలు చేయడంలో ఎప్పుడూ ముందుండే కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. అదానీ కోసం బయ్యారం బలి అయ్యారని ట్వీట్ చేశారు. ఈ అంశంపై వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్లను జత చేశారు.
తెలంగాణలో రాజకీయ వేడి రోజురోజుకూ వేడెక్కుతోంది. పార్టీ నుంచి వ్యక్తిగతంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బండి సంజయ్ నేతృత్వంలో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
తెలంగాణ నూతన సచివాలయం కొత్తరూపకల్పనకు రూపుదిద్దుకుంటోంది. అయితే నూతన సచివాలయం మొదలు పెట్టినప్పటి నుంచి సచివాలయంపై పలు పార్టీనేతలు, మరి కొందరు ఆకతాయిలు షోషల్ మీడియా పోస్ట్లు తీవ్ర వివాదానికి సృష్టించాయి.