హత్యలు, అత్యాచారాలు, భూకబ్జాలు, డ్రగ్స్ దందాలకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్ గా నిలిచిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. తాండూరులో పోలీసుల సమక్షంలోనే బీజేపీ నేత మురళీగౌడ్ నివాసంపై దాడులు జరిపి పసిపిల్లలని చూడకుండా కుటుంబ సభ్యులను చంపే యత్నం చేసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ‘‘పోలీసులు చేతగానివాళ్లా? మాపై కూడా దాడులు జరిగాయని పోలీసులు చెప్పడం సిగ్గు చేటు…మీలాంటి వాళ్లకు డ్యూటీ ఎందుకు? తప్పుకుని ఇంట్లో కూర్చోండి’’అన్నారు. తక్షణమే డీజీపీ స్పందించి బాధ్యులపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్, వీరేందర్ గౌడ్ సహా పలువురు బీజేపీ నేతలు, భారీ ఎత్తున కార్యకర్తలతో కలిసి ఈరోజు సాయంత్రం తాండూరు విచ్చేసిన బండి సంజయ్ మురళీ గౌడ్ నివాసానికి వెళ్లారు. మురళీ గౌడ్ తోపాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. బీఆర్ఎస్ గూండాల దాడిని, పోలీసులు వ్యవహరించిన తీరును అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యుల ఆవేదనను చూసి చలించిపోయారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
Also Read : ICC Test Rankings: రెండో స్థానంలో అశ్విన్, టాప్-10లోకి జడేజా.. ఆల్‌రౌండర్లుగానూ..
‘రెండ్రోజుల క్రితం బీజేపీ నాయకులు, గ్రంధాలయ సంస్థ మాజీ ఛైర్మన్ మురళీగౌడ్ నివాసంపై టీఆర్ఎస్ గూండాలు విచక్షణా రహితంగా దాడి చేశారు. ఆ కుటుంబాన్ని చంపే యత్నం చేశారు. తెలంగాణ సమాజమంతా చూసింది. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. బుద్ది, జ్ఝానం ఉన్నోళ్లకు తెలుసు. స్వార్థ బుద్ధి ఉన్నవాళ్లకు ఇది తెలియదు. నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడినయ్యాక… మా పార్టీ కార్యకర్తలకు, ఇతర పార్టీ నాయకులకు కూడా చెప్పిన. ఇండ్ల మీద దాడి చేయడం తప్పు. మావాళ్లు ఎవరైనా దాడి చేస్తే యాక్షన్ తీసుకుంటానని చెప్పిన.
Also Read : Medico Preethi : కలకలం రేపుతున్న మెడికో ప్రీతి ఘటన.. అసలేం జరిగింది..?
రాజకీయాలతో కుటుంబ సభ్యులకు సంబంధం లేదు. మీకు చేతనైతే నేతలతో కొట్లాడండి. కానీ బలుపెక్కి డ్రగ్స్ తీసుకుని, మందుతాగి వచ్చి దాడి చేశారు. వాళ్లను టెస్ట్ చేయాలి. మీరు బయట నుండి రాళ్లేస్తే ఇండ్లో చిన్న పిల్లలు, వ్రుద్దులుంటారు. తగల రాని చోట తగిలితే చనిపోతారని అనేక సందర్భాల్లో చెబుతున్న. అయినా అధికార పార్టీ నేతలకు బలుపెక్కింది. ఇంకా ఎన్నిరోజులు అధికారంలో ఉంటారు?
మురళీ మీపై ఆరోపణలు చేశారు. మీరు శుద్ధపూసలైతే వివరణ ఇవ్వండి. ప్రజలు గమనిస్తారు. ప్రజాభిమానం ఎవరికి ఉంది? ఎవరు డ్రగ్స్ తీసుకుంటారు? ఎవరు డ్రగ్స్ తీసుకుంటారు? ప్రజలు ఆలోచిస్తారు. అది చేతగాకుండా తాగిపించి, డ్రగ్స్ ఇచ్చి ఇట్లా (పిల్లలను చూపిస్తూ) పసి పిల్లలపై దాడులు చేస్తారా? వీళ్లకు ఏం సంబంధం? మురళీ నాన్న రిటైర్డ్ టీచర్.. ఆయనకు ఏం సంబంధం?
దాడి చేసిన కుటుంబ సభ్యులకు ఈ వీడియో చూపించండి… చిన్న పిల్లలపై దాడి చేసి చంపే ప్రయత్నం చేశామని చెప్పండి… చెప్పు తీసుకుని కొడతారు. ఇంట్ల తిండికూడా పెట్టరు. రాజకీయాలతో పిల్లలకు ఏం సంబంధం? ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోండి. కుటుంబ సభ్యులకు ఏమైనా అయితే పిల్లలను ఎవరు ఆదుకుంటారు? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికైనా మీలో కొంచెమైనా మార్పు వస్తుందని అనుకుంటున్నా. మీలో నిజాయితీ ఉంటే, మానవత్వం ఉంటే….దాడి చేయమని ఉసిగొల్పినవాడిని గల్లా పట్టి అడగండి.’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.