AAP vs BJP: ఎంసీడీలో ముదిరిన కొట్లాట.. జై మోదీ, జై కేజ్రీవాల్ అంటూ కొట్టుకున్న కార్పొరేటర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AAP vs BJP: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లోని స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గందరగోళం నెలకొంది. కీలక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోరుకు దారితీసింది. ఒక్క ఓటు చెల్లకుండా పోవడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌లో అత్యంత శక్తివంతమైన సంస్థగా భావించే స్టాండింగ్ కమిటీ ఎన్నికల ఫలితం చెల్లని ఓటు లేకుండానే ప్రకటించబడుతుందని మేయర్ పట్టుబట్టారు. ఈ నిర్ణయంతో సభలో పోరాటాలు జరిగాయి. ఎన్నికైన కౌన్సిలర్లు ఒకరినొకరు కొట్టుకోవడం, తన్నడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య వాగ్వాదం కారణంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు రద్దయ్యాయి. ఘర్షణ సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కౌన్సిలర్ అశోక్ కుమార్ మాను ఢిల్లీ సివిక్ సెంటర్‌లో కుప్పకూలారు. బీజేపీ గూండాల వల్ల ఈ గొడవ జరిగిందని ఆరోపించారు. ‘మహిళలు, మేయర్‌పై కూడా దాడి చేసేంత సిగ్గులేని వారు.. బీజేపీ గూండాలు ఈ పని చేశారు’ అని మాను అన్నారు. ఈ సభలో ఆప్, బీజేపీ నేతలు టేబుల్స్‌పైకి ఎక్కి నినాదాలు చేశారు. దీంతో, ఆ ప్రాంతంలో రసాభాస జరిగింది.
మరోవైపు.. ఈ ఎన్నికల్లో ఒక్క ఓటు చెల్లదంటూ మేయర్ షెల్లీ ఒబెరాయ్ ప్రకటించడంతో సభలో బాహాబాహీ జరిగింది. బీజేపీ, ఆప్ కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. సభలో తన్నుకోవడంతో పోలీసులు రంగం ప్రవేశం చేశారు. కౌన్సిలర్లను అడ్డుకున్నారు. కొందరు బీజేపీ కౌన్సిలర్లు మీకు తెలివి లేదంటూ ఆమెపై అరిచారు. “స్థాయీ సంఘం ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని గ్రహించిన వెంటనే, అది మా మేయర్‌పై దాడి చేసింది. షెల్లీ ఒబెరాయ్ తనను తాను రక్షించుకోవడానికి హౌస్ నుండి బయటకు పరుగెత్తాల్సి వచ్చింది. బీజేపీకి చెందిన మగ కౌన్సిలర్లు ఆమెపై భౌతిక దాడి చేశారు. బీజేపీ ఓటమిని అంగీకరించాలి. తాము ఓడిపోయామని గ్రహించినప్పుడు, వారు మహిళా మేయర్‌పై దాడి చేశారు’ అని ఆప్ ఎమ్మెల్యే అతిషి తెలిపారు. ఎన్నికల సమయంలో తనపై బీజేపీ కౌన్సిలర్లు దాడి చేశారని ఢిల్లీ కొత్త మేయర్ షెల్లీ ఒబెరాయ్ ఆరోపించడంతో ఈ నాటకం బుధవారం ప్రారంభమైంది.
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
Read Also: Jr. NTR political Entry: జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో తామే గెలిచామని ఆప్ నేతలు చెబుతున్నప్పటికీ బీజేపీ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. అయితే, ఎన్నికల అధికారులు మొత్తం ఆరుగురు సభ్యుల స్టాండింగ్ కమిటీకి ముగ్గురు ఆప్ సభ్యులు, ముగ్గురు బీజేపీ సభ్యులు ఎన్నికయ్యారని తెలిపినట్లు బీజేపీ చెబుతోంది. ఆప్ తామే గెలిచినట్లు తప్పుడు ప్రకటన చేసిందని బీజేపీ ఎదురుదాడికి దిగింది. దీంతో, స్టాండింగ్ కమిటీ గెలుపు ఎవరిదనే విషయంపై సస్పెన్స్‌గా మారింది. ఈ నేపథ్యంలో సభలో కొందరు కౌన్సిలర్లు జై శ్రీరామ్, జై మోదీ అంటూ నినాదాలు చేయగా.. ఆప్ కౌన్సిలర్లు ఆమ్ ఆద్మీ పార్టీ జిందాబాద్, కేజ్రీవాల్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.ఇక, ఈ ఎన్నికల్లో ఆప్ కోసం అమీల్ మాలిక్, రమీందర్ కౌర్, మోహిని జీన్‌వాల్, సారిక చౌదరిలను నామినేట్ చేసింది. మరోవైపు, బీజేపీ కమల్‌జీత్ సెహ్రావత్, పంకజ్ లూథ్రాలను రంగంలోకి దింపింది. కాగా, బీజేపీలో చేరిన ఇండిపెండెంట్ కౌన్సిలర్ గజేందర్ సింగ్ దారాల్ కూడా పోటీలో ఉన్నారు. అయితే, స్టాండింగ్ కమిటీకి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది నిధులను ఎలా ఉపయోగించాలి, పలు ప్రాజెక్ట్‌లపై నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది.
VIDEO | A councillor collapses as the ruckus continues in the MCD House. pic.twitter.com/aSDB5S4tfA
— Press Trust of India (@PTI_News) February 24, 2023
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..