Revanth reddy: అందరూ హనుమాన్ చాలీసా చదవాలిసిందే అని, లక్ష్మణ్.. కిషన్ రెడ్డి వస్తే కలిసి చదువు కుందామని టీపీసీసీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేవారు. గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ.. ప్రియాంక గాంధీ మీకోసం వస్తున్నారని, వరంగల్ రైతు డిక్లరేషన్ మాదిరిగానే యువత కోసం హైదరాబాద్ డిక్లరేషన్ అన్నారు.
Bajrangdal protest: కర్ణాటకలో మొదలైన కాంగ్రెస్ మేనిఫెస్టో సెగ తెలంగాణను తాకింది. బజరంగ్‌దళ్‌పై నిషేధం విధిస్తామన్న కాంగ్రెస్ హామీపై కర్ణాటకలో బీజేపీ ఇప్పటికే వివాదంలో ఉంది. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభల్లో నినాదాలు చేశారు.
Karnataka Elections: కర్ణాటక ఎన్నికలకు మరో 5 రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే మెజారిటీ ఒపీనియన్ పోల్స్ బీజేపీకి ఎదురుదెబ్బ తప్పదని తమ సర్వేలను వెల్లడించాయి. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని, లేకపోతే సింగిల్ లార్జెట్ పార్టీగా అవతరిస్తుందని చెబుతున్నాయి. మూడు ఒపీనియన్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటే.. మూడు రోజుల క్రితం వెలుబడిన జీన్యూస్-మాట్రిక్స్ ఒపీనియన్ పోల్ మాత్రం బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని తెలిపింది.
Asaduddin Owaisi: మతం ఆధారంగా కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీలు ఓట్లు అడుగుతున్నాయని మండిపడ్డారు ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసద్దుదీన్ ఓవైసీ. హుబ్లీలో కూల్చివేసిన దర్గా పునర్మిర్మానికి కాంగ్రెస్ హామీ ఇస్తుందా..? అని ప్రశ్నించారు. బీజేపీతో సైద్ధాంతిక పోరాటానికి లొంగిపోయిందని అన్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలత్లో హనుమాన్ ఆలయాల నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ గురువారం ప్రకటించిన నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు.
Nithish Kumar : బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు పాట్నా హైకోర్టు షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో తన ఆధ్వర్యంలో చేపడుతున్న కుల గణనను హైకోర్టు నిలిపేసింది. బడుగు బలహీన వర్గాల వారిని ఆదుకునే ఉద్దేశంతో నితీష్ కుమార్ కుల ఆధారిత సర్వే నిర్వహిస్తున్నారు.
Somu Veerraju: హిందువుల మనోభావాలను దెబ్బ తీయడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని విమర్శించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ కార్యదర్శి సోమువీర్రాజు.. గుంటూరులో అగ్రహారం పేరు రాత్రికి రాత్రి ఫాతిమా పేరుతో బోర్డు పెట్టడంలో ఈ ప్రభుత్వం ఉద్దేశం ఏమిటి..? అని మండిపడ్డారు.. విశాఖ నగరంలో సీతమ్మ కొండ పేరు మార్చడం, ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టాలని ప్రయత్నం.. ఈ తరహా సంఘటనలకు ఎవరు సూత్రధారి..? అంటూ నిలదీశారు.. ముస్లింల…
Wrestlers protest: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్నారు. మహిళా క్రీడాకారిణులపై బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ లైంగిక వేధిపులకు పాల్పడినట్లు రెబర్లు ఆరోపిస్తున్నారు. అతడిని ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.