Kiccha Sudeep: బసవరాజ్ బొమ్మైకి మాత్రమే ప్రచారం చేశా.. పార్టీకికాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kiccha Sudeep: కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు.. సీఎం బసవరాజ్ బొమ్మైతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. ఆ తర్వాత పలు చోట్ల బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.. ఇక, ఈ రోజు ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఆసక్తికర కామెంట్లు చేశారు.. నేను సీఎం బసవరాజ్ బొమ్మైకి మాత్రమే ప్రచారం చేశా.. పార్టీకి కాదని స్పష్టం చేశారు.. అయితే, నేను స్టార్ కంపెయినర్ గా వెళ్లినంత మాత్రాన ఎవరూ ఓట్లు వేయరు, పౌరులుగా ప్రతిఒక్కరు బాధ్యతగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు.. ఉదయం వరకు 21 శాతం పోలింగ్ నమోదు అయిందంటే షాకింగ్‌గా ఉందన్న ఆయన.. అందరూ ముందుకు రావాలి… ఓటు హక్కు వినియోగించుకోవానలి సూచించారు.
నాకు ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలేదని మరోసారి స్పష్టం చేశారు కిచ్చా సుదీప్.. దశాబ్దాల కాలంపాటు నటుడిగానే ఉండలనుకుంటున్నానని తెలిపారు.. రాజకీయాల్లోకి వచ్చే అనుభవం, ఆలోచన లేదన్నారు.. కుటుంబ సమేతంగా వచ్చి ఓటు వేశా.. ప్రతిఒక్కరు ఓటు హక్కు ను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.. నేను సమాజానికి సందేశాలు ఇవ్వను, ఎవరి బాధ్యత ఆళ్లు నిర్వర్తించాలన్నారు.. ఓటు ఎంతోమంది భవిష్యత్ ను నిర్దేషిస్తుంది.. ఓటు వేయానివాళ్లు దాని ఫలితాన్ని అనుభవిస్తారని హెచ్చరించారు కిచ్చా సుదీప్..
Also Read
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
కాగా, కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కిచ్చా సుదీప్ బీజేపీ అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహించారు. ఈ నెల ప్రారంభంలో, సుదీప్ కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైతో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. నేను ఇక్కడకు రావాల్సిన అవసరం లేదు, మరియు నేను ఇక్కడకు ఏ ప్లాట్‌ఫారమ్ లేదా డబ్బు కోసం ఇక్కడకు రాలేదు, నేను ఇక్కడకు కేవలం ఒక వ్యక్తి కోసం వచ్చాను, నాకు సీఎం అమ్మ (బొమ్మై) అంటే చాలా గౌరవం. అందుకే బొమ్మై సార్‌కి నా పూర్తి మద్దతు ఇస్తున్నాను అని ప్రకటిస్తున్నాను. ఒక పౌరుడిగా, ప్రధాని మోడీ తీసుకున్న కొన్ని నిర్ణయాలను నేను పూర్తిగా గౌరవిస్తాను, కానీ, ఈ రోజు ఇక్కడ కూర్చోవడానికి దానితో సంబంధం లేదని వ్యాఖ్యానించిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!