Karnataka Polls: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో సోనియా గాంధీ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.. సోనియా గాంధీ చేసిన ట్వీట్ ఈ దుమారానికా కారణం అవుతుంది. కర్ణాటక ప్రతిష్ఠకు, సార్వభౌమత్వానికి, సమగ్రతకు ముప్పు వాటిల్లేలా.. తమ పార్టీ ఎవరినీ అనుమతించదంటూ సోనియా గాంధీ పేరుతో ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ.. ఈ కామెంట్లను ఖండించారు. వేర్పాటువాదంపై ఆ పార్టీ బహిరంగ ప్రకటనలు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్‌తోపాటు సోనియాపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ..…
కర్ణాటక అసెంబ్లీ 2023 ఎన్నికల ప్రచారం ముగిసింది. గత కొన్ని రోజులుగా మూడు ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ నుంచి ముఖ్య నేతలు ఓటర్లను ఆకట్టుకునేందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.
వివాదాస్పదమైన ‘ది కేరళ స్టోరీ’ సినిమా కొత్త తరహా ఉగ్రవాదాన్ని బయటపెట్టిందని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. బెంగళూరులో ఈ చిత్రాన్ని ఆయన ఆదివారం వీక్షించారు.
Himanta Biswa Sarma: కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ తరుపున ప్రచారం చేస్తున్న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని విమర్శించారు. కర్ణాటక ప్రజలకు రాహుల్ గాంధీ గ్యారెంటీ ఇస్తున్నారు.. అయితే రాహుల్ గాంధీ గ్యారెంటీ ఎవరు తీసుకుంటారు..రాహుల్ గాంధీని నిలబెట్టేందుకు సోనియాగాంధీ గత 20 ఏళ్లుగా ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యక్తి కర్ణాటక ప్రజలకు హామీ ఇస్తారా..? అంటూ ప్రశ్నించారు.
PM Modi: కర్ణాటకలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీలు విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. వరసగా రెండో రోజు బెంగళూర్ నగరంలో ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహిస్తున్నారు. అంతకుముందు రోజు శనివారం మూడు గంటల పాటు మోదీ రోడ్ షో జరిగింది. దాదాపుగా 13 నియోజకవర్గాలను కవర్ చేస్తూ శనివారం నగరంలో దాదాపు 26 కి.మీ రోడ్‌షో నిర్వహించిన ప్రధానిని చూసేందుకు భారీగా ప్రజలు రోడ్డుకిరువైపుల…