Karnataka Polls: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో సోనియా గాంధీ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.. సోనియా గాంధీ చేసిన ట్వీట్ ఈ దుమారానికా కారణం అవుతుంది. కర్ణాటక ప్రతిష్ఠకు, సార్వభౌమత్వానికి, సమగ్రతకు ముప్పు వాటిల్లేలా.. తమ పార్టీ ఎవరినీ అనుమతించదంటూ సోనియా గాంధీ పేరుతో ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ.. ఈ కామెంట్లను ఖండించారు. వేర్పాటువాదంపై ఆ పార్టీ బహిరంగ ప్రకటనలు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్‌తోపాటు సోనియాపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ లేఖ రాసింది. కాంగ్రెస్ పార్టీ.. దేశ వ్యతిరేక శక్తుల పట్ల పక్షపాతం వహించే పార్టీ అని బీజేపీ విమర్శించింది. పీఎఫ్‌ఎఐ వంటి వేర్పాటువాద సంస్థలు, ఉద్యమాలకు ఇది మద్దతిస్తోందని ఆరోపించింది.
కర్ణాటక సార్వభౌమత్వం అంటూ సోనియా మాట్లాడటం పట్ల ఈసీకి కంప్లైంట్ చేసింది బీజేపీ. ఈనెల 10వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. సార్వభౌమత్వం అని ఓ సభలో సోనియా గాంధీ అనడం రాజకీయ దుమారాన్ని రేపింది. దేశం నుంచి కర్ణాటకను విభజించాలని కాంగ్రెస్ భావిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైతం ఆదివారం ఆరోపించారు. ఇదే అంశంపై బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. సార్వభౌమత్వం కామెంట్ చేసిన సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్‍పై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. కాగా, “కర్ణాటక ప్రతిష్ట, సార్వభౌమత్వం, సమగ్రతకు ముప్పు కలిగించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎవరినీ అనుమతించదు” అని సభలో సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలను మే 6న కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. దీంట్లో సార్వభౌమత్వం అనే మాట దుమారాన్ని రేపుతోంది. స్వాతంత్య్రం వచ్చినప్పుడే దేశం మొత్తానికి సార్వభౌమత్వం వచ్చిందని, కర్ణాటకకు సొంతంగా సార్వభౌమత్వం ఏంటని ప్రశ్నిస్తోంది బీజేపీ. దేశం నుంచి కర్ణాటకను విడదీయాలని కాంగ్రెస్ భావిస్తోందని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు.