కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. ఇక 80 ఏళ్ల పైబడిన వారు, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే ఏర్పాట్లు కూడా ఎన్నికల సంఘం చేసింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు చేయాలంటే 113 సీట్లు కావాల్సి ఉంటుంది.
Samajwadi MLA Thrashes BJP Leader's Husband: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో విపక్ష ఎమ్మెల్యే అధికార బీజేపీ పార్టీకి చెందిన నాయకురాలి భర్తను చితకబాదాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అమేథీ జిల్లాలోని గౌరీగంజ్ కొత్వాలి పోలీస్ స్టేషన్లో బీజేపీ మున్సిపల్ ఎన్నికల అభ్యర్థి రష్మీ సింగ్ భర్త దీపక్ సింగ్‌పై సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) శాసనసభ్యుడు రాకేష్ ప్రతాప్ సింగ్ దాడి చేశారు.
PM Modi: 2008 జైపూర్ వరస పేలుళ్ల నిందితులను నిర్దోషిగా విడుదల చేయడాన్ని ప్రధాని నరేంద్రమోడీ తప్పపట్టారు. రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం బుజ్జగింపు విధానాన్ని అవలంభిస్తోందని, ఉగ్రవాదులపై మెతక వైఖరి ప్రదర్శిస్తోందని ప్రధాని ఆరోపించారు. రాజస్థాన్‌లోని అబురోడ్‌లో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ,
Kiccha Sudeep: కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు.. సీఎం బసవరాజ్ బొమ్మైతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. ఆ తర్వాత పలు చోట్ల బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.. ఇక, ఈ రోజు ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఆసక్తికర కామెంట్లు చేశారు.. నేను సీఎం బసవరాజ్ బొమ్మైకి మాత్రమే ప్రచారం చేశా.. పార్టీకి కాదని స్పష్టం చేశారు.. అయితే, నేను స్టార్…
ఈనెల 11న సంగారెడ్డి పట్టణంలో నిర్వహించే ‘‘నిరుద్యోగ మార్చ్’’ను దిగ్విజయవంతం చేసి సత్తా చాటాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Off The Record: ఏపీ బీజేపీలో నోటీసుల కలకలం రేగుతోంది. సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు ఇచ్చిన షోకాజ్ నోటీసుపై ఇప్పుడు పార్టీతో పాటు ఏపీ రాజకీయాల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోందట. పొత్తులు, మోడీతో చర్చల సారాంశం వంటి అంశాలకు సంబంధించి విష్ణు సంబంధంలేని కామెంట్స్ చేశారని, అందుకుగాను.. పార్టీ సభ్యత్వం నుంచి ఎందుకు తొలగించకూడదంటూ షోకాజ్ నోటీసు ఇచ్చింది నాయకత్వం. గతంలో కొందరికి నోటీసులు ఇచ్చినా.. మరికొంత మందిని క్రమశిక్షణ చర్యల కింద…
Vivek Agnihotri: ‘‘ది కాశ్మీర్ ఫైల్స్’’ డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి లీగల్ నోటీసులు పంపించారు. ఈ విషయాన్ని వివేక్ అగ్నిహోత్రి మంగళవారం తెలిపారు. అయితే ఈ లీగల్ నోలీసుపై తమకు ఎలాంటి సమాచారం లేదని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
Assam looking to ban polygaymy: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరో సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్రంలోకి బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు, మతమార్పిడులు, బాల్యవివాహాలపై ఉక్కుపాదం మోపుతున్న ఆయన ఇప్పుడు ‘‘బహుభార్యత్వం’’ నిషేధించాని చూస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో బహుభార్యత్వంపై నిషేధించడం విధించడంపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. న్యాయపరమైన అంశాలను అన్వేషించేందుకు నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Karnataka Election : కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు నేడు రాష్ట్రంలో నిశ్శబ్ద ప్రచారం జరుగుతోంది. అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు మరోసారి ఓటర్ల ఇళ్లకు వెళ్లి ప్రచారం నిర్వహించి ఓట్లు రాబట్టనున్నారు.
Karnataka Elections: కర్ణాటకలో 20 రోజులుగా సాగిన ఎన్నికల ప్రచార హోరు ముగిసింది. ర్యాలీలు, రోడ్ షోలకు తెరపడింది. 224 సీట్లున్న కర్ణాటక అసెంబ్లీకి ఈ నెల 10న ఎన్నికలు జరుగనున్నాయి. 13న ఫలితాలు వస్తాయి. ప్రజలు ఎలాంటి ఫలితం ఇస్తారనే విషయమై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కర్ణాటక ఎన్నికల్లో భాగంగా ప్రధాన పార్టీల చూపంతా బెంగళూరుపైనే ఉంది. అందుకే ఆఖరి పంచ్ ఐటీ సిటీలో ఇచ్చాయి ప్రధాన పార్టీలు. కర్ణాటకలో ఏ పార్టీ అధికారం చేపట్టాలన్నా…