Karnataka Elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మే 13న కన్నడ నాట ఎవరు అధికారం చేపడుతారో తేలబోతోంది. మెజారిటీ సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ అధికారంకి వస్తుందని, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలుస్తుందని ప్రకటించాయి. ఒకటి రెండూ మాత్రమే బీజేపీ అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలతో కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ శ్రేణులు ఉత్సామాన్ని ఉద్దేశిస్తూ బీజేపీ నేత అమిత్ మాలవీయ వ్యంగ్యంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు అంబులెన్సులు సిద్ధం చేసుకోవాలని సూచించారు.
Read Also: Monkeypox: మంకీపాక్స్‌పై ఎమర్జెన్సీ ఎత్తేసిన డబ్ల్యూహెచ్ఓ
ఎగ్జిట్ పోల్స్ మఅంచనాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ గెలుపుపై ఆశాలు పెట్టుకుందని, వారి సంబరాలు చూస్తుంటే సరదాగా ఉందని, అవి ఎగ్జిట్ పోల్స్ మాత్రమే అని నిజమైన ఫలితాలు కావని అన్నారు. కాంగ్రెస్ శ్రేణులకు నాదో సలహా.. ఎందుకైనా మంచిది అంబులెన్సులు సిద్ధం చేసుకోండి, ఎందుకంటే అంచనాలు తలకిందులయ్యే అవకాశం ఉంది, ఫలితాలు తారుమారు అయితే అవి మీకు ఉపయోగపడుతాయని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఇక ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూసి కాంగ్రెస్ నేతలు తమకు 130 కన్నా ఎక్కువ స్థానాలు వస్తాయని చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయి నుంచి మాకు అందిన సమాచారం ప్రకారం బీజేపీకి 100 శాతం మెజారిటీ వస్తుందని సీఎం బసవరాజ్ బొమ్మై ధీమా వ్యక్తం చేశారు. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు సెమీఫైనల్స్ గా భావిస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 13 విడుదల అవుతాయి. 35 ఏళ్లుగా కర్ణాటకలో ఏ ప్రభుత్వం కూడా వరసగా రెండు సార్లు అధికారంలోకి రాలేదు. అయితే ఈ సారి ఆ సంప్రదాయాన్ని తిరగరాయాలని బీజేపీ భావిస్తుంటే.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తామని ఆశల్లో ఉంది. ఎప్పటిలాగే హంగ్ ఏర్పడితే జేడీయూ కింగ్ మేకర్ పాత్రను పోషించేందుకు సిద్ధంగా ఉంది.