Bandi Sanjay : కేంద్రం డబ్బులు వాడుకొని తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ళు కేటాయించాలంటూ కూకట్‌పల్లి మూసాపేటలో బీజేపీ నాయకుల 24 గంటల ఆత్మగౌరవ దీక్ష చేపట్టారు. అయితే.. ఈ ఆత్మగౌరవ దీక్షకు ముఖ్య అతిథిగా హాజరై సంఘీభావం తెలిపారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆవాస్ యోజన పథకం కింద వచ్చిన డబ్బులు వాడుకొని డబల్ బెడ్ రూమ్ లు నిర్మించకుండా తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు.. తెలంగాణలో బీఆర్‌ఎస్ వైఫల్యాలను, మోసాలను లేవనెత్తుతున్నారనే భయంతో బీజేపీ నాయకుల పై కేసులు పెడుతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా బీజేపీ నాయకులను అడ్డుకోలేరని, భయపెట్టలేరని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
Also Read : Naga Shaurya: ‘రంగబలి’ రిలీజ్ డేట్ లాక్ చేశారుగా!
Also Read
ధర్మం కోసం బీజేపీ నాయకులు నిరంతరం ప్రజల తరఫున పోరాటం చేస్తూ ఉంటారని బండి సంజయ్ గుర్తు చేశారు. డబల్ బెడ్ రూమ్ ల విషయమై ఎన్నిసార్లు కేంద్రం జాబితా ఇవ్వాలని కోరిన కేసీఆర్ ఇవ్వకుండా జాప్యం చేస్తూ.. నిరుపేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారన్నారు బండి సంజయ్. కేంద్రం నిధులతో డబల్ బెడ్రూంలు నిర్మించి ఉంటే ధైర్యంగా జాబితాను కేంద్రానికి ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాబోవు రోజుల్లో తెలంగాణలో ప్రజలు ఓటు బ్యాంకుతో కేసీఆర్‌కు బుద్ధి చెబుతారని ఆయన అన్నారు..ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
Also Read : CM YS Jagan: పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సీఎం జగన్ సమీక్ష..
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
-
Shai Hope: అదే మా కొంప ముంచింది.. చాలా బాధగా ఉంది.. వెస్టిండీస్ కెప్టెన్ ఆవేదన..
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!