Karnataka Elections: కర్ణాటక ఎన్నికల్లో ఓటర్లు తమ చైతన్యాన్ని చూపారు. 224 అసెంబ్లీ స్థానాలకు బుధవారం జరిగిన ఎన్నికల్లో 73.19 శాతం ఓటింగ్ నమోదు అయింది. గతంలో 2018 ఎన్నికల నమోదైన 72.44 శాతంతో పోలిస్తే స్వల్పంగా ఎక్కువగా రికార్డ్ అయింది. ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు మెజారిటీ స్థానాలు వచ్చినా.. హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉందని, కొన్ని సర్వేలు మాత్రం బీజేపీ అధికారంలోకి వస్తాయని వెల్లడించాయి.
Karnataka Election: కర్ణాటక ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ఘట్టం ముగిసింది.. ఈ నెల 13వ తేదీన ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు.. అయితే, కర్ణాటక ఎన్నికలపై ఆది నుంచి తెలుగు రాష్ట్రాల్లో జోరుగా బెట్టింగ్ సాగుతోంది.. ఇక, పోలింగ్ ముగిసిన తర్వాత.. కర్ణాటకలో గెలుపెవరిది? ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటూ బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు.. పోలింగ్ ముందు వరకు ఒక అంచనాతో ఉన్న బెట్టింగ్ రాయుళ్లు.. పోలింగ్ సరళి, ఎగ్జిట్ పోల్స్ చూసి కొత్త ఎత్తులు వేస్తున్నారు.…
Maharashtra Political Crisis: మహరాష్ట్ర రాజకీయ సంక్షోభం, ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సీఎం ఏక్ నాథ్ షిండేతో పాటు 15 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని పునరుద్ధరించడానికి నిరాకరించింది. షిండే వర్గానికి చెందిన భరత్ గోగావాలేను శివసేన విప్గా నియమిస్తూ హౌస్ స్పీకర్ తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమని సుప్రీం పేర్కొంది.
Maharashtra Political Crisis: మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే శివసేన, బీజేపీ ప్రభుత్వానికి విషమ పరీక్ష ఎదురుకాబోతోంది. పార్టీ ఫిరాయించిన శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఉద్దవ్ ఠాక్రే వర్గం వేసిన పిటిషన్ పై రేపు అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వబోతోంది. గతేడాది శివసేన తిరుగుబాటుపై ఉద్దవ్ ఠాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2022 జూన్ నెలలో అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసినందుకు ఏక్ నాథ్ షిండేతో పాటు 15 మంది ఎమ్మెల్యేలపై అనర్హత…
BJP Nirudyoga march: నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నేడు ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో బీజేపీ శ్రేణులు “నిరుద్యోగ యాత్ర” నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, ఈటల, విజయశాంతి, రఘునందన్ రావు, రాష్ట్ర బీజేపీ నేతలు పాల్గొంటారు.
Pakistan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో ఆ దేశం రణరంగంగా మారింది. ఆయన మద్దతుదారులు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ తో పాటు కరాచీ, పెషావర్, లాహోర్, క్వెట్టా ఇలా అన్ని ప్రధాన నగరాల్లో, పట్టణాల్లో ఆందోళనలు మిన్నంటాయి.
karnataka Exit Poll: 2024 లోక్ సభ ఎన్నికల ముందు కీలకంగా భావిస్తున్న కర్ణాటక అసెంబ్లీ పోలింగ్ ముగిసింది. ఈ రోజు 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి.